365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 5,2025 : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్‌ను ఒకేసారి జూన్ నెలలోనే పంపిణీ చేయనుంది. ఈ చర్య ద్వారా ప్రజలకు అవసరమైన సరుకులు సమయానికి అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

జూన్ నెల మొత్తం రేషన్ షాపులు ఓపెన్..

జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులు పనిచేస్తాయి. దీంతో ప్రజలందరూ సమయానికి రేషన్ తీసుకోవచ్చని ఓ సివిల్ సప్లైస్ సర్కిల్ అసిస్టెంట్ ఆఫీసర్ తెలిపారు.

మూడు నెలల రేషన్ కోసం ట్రిపుల్ ఫింగర్ ప్రింట్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి..

సాధారణంగా నెలకి ఒక్కసారి ఫింగర్ ప్రింట్ వేస్తారు. కానీ జూన్ నెలలో విధానంలో కొంత మార్పు చేశారు. ఈసారి మూడు నెలలకు సరిపడా రేషన్ కు మూడు సార్లు ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సరుకుల తప్పుదోవకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

ప్రతి కుటుంబ సభ్యుడికి eKYC తప్పనిసరి..

Read This also…Tragedy Strikes RCB Victory Parade: 11 Dead in Bengaluru Stampede..

Read This also…RCB vs PBKS Face Off in IPL 2025 Final Tonight..

ఇది కూడా చదవండి…హ్యుందాయ్ కొత్త ప్రచారం: పంకజ్ త్రిపాఠి తో ‘లిజన్ టు యువర్ దిల్ ఆర్ ది డీల్స్’..

రేషన్ కార్డుకు లింక్ అయిన ప్రతి కుటుంబ సభ్యుడు eKYC ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికీ ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో రాబోయే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

కార్డు ప్రకారం బియ్యం పంపిణీ వివరాలు
AFSC కార్డు: ఒక్క కార్డుకి 35 కిలోల బియ్యం

FSC కార్డు: ఒక్క సభ్యుడికి 6 కిలోల బియ్యం

అన్నపూర్ణ కార్డు: ఒక్క కార్డుకి 10 కిలోల బియ్యం

అంతేకాకుండా, షుగర్, పిండి వంటి ఇతర నిత్యావసర వస్తువులు కూడా కార్డు ప్రకారం అందజేస్తారు.