365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 19,2025 : కృత్రిమ మేధస్సు (Artificial Intelligence- AI) రంగంలో నైపుణ్యాలు ,సృజనాత్మకతను పెంచుకోవాలనుకుంటున్న యువతకు గూగుల్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఏఐకి సంబంధించిన ఐదు ఉచిత ఆన్లైన్ కోర్సులను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.
ఈ కోర్సుల ద్వారా ఏఐకి సంబంధించిన మెలకువలను నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల వివరాలు, వీడియో పాఠాలు, క్విజ్లు కూడా ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి.
గూగుల్ అందిస్తున్న ఉచిత కోర్సుల వివరాలు..
నేటి ఉద్యోగ మార్కెట్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. యువతలో ఏఐపై ఆసక్తిని పెంచే ఉద్దేశంతో గూగుల్ ఈ ఐదు ఉచిత ఆన్లైన్ కోర్సులను రూపొందించింది.
- గూగుల్ ఏఐ ఎసెన్షియల్ స్పెషలైజేషన్..
సమయం: 4 గంటలు.
ఎవరి కోసం: ప్రారంభ స్థాయి అభ్యర్థుల కోసం.

విషయాలు: ఏఐ పరిచయం, ఏఐ టూల్స్‌తో ఉత్పాదకతను పెంచడం, ప్రాంప్టింగ్, ఏఐ బాధ్యత, ఏఐ కర్వ్ వంటి ఐదు మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి.
- ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ:
సమయం: 45 నిమిషాలు.
ఎవరి కోసం: జనరేటివ్ ఏఐ గురించి తెలుసుకోవాలనుకునేవారికి.
విషయాలు: జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి, దానిని ఎలా ఉపయోగించాలి, ఇది సంప్రదాయ మెషిన్ లెర్నింగ్ పద్ధతుల నుంచి ఎలా భిన్నంగా ఉంటుందో ఈ కోర్సులో నేర్పిస్తారు.
- లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM):
సమయం: మైక్రో లెర్నింగ్ కోర్స్.
ఎవరి కోసం: ప్రారంభ స్థాయి వారికి.
విషయాలు: లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాంప్ట్ ట్యూనింగ్ కోసం ఎల్ఎల్ఎంలను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను నేర్పుతారు. అదనంగా, ఈ కోర్సులో చదవడానికి సంబంధించిన విషయాలు, క్విజ్లు కూడా ఉన్నాయి.
- రెస్పాన్సిబుల్ ఏఐ:
సమయం: 30 నిమిషాలు.
ఎవరి కోసం: ఏఐలో నైతికత, బాధ్యత గురించి తెలుసుకోవాలనుకునేవారికి.
విషయాలు: బాధ్యతాయుతమైన ఏఐ (Responsible AI) అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యమైనది, గూగుల్ తమ ఏఐ ఉత్పత్తులలో దానిని ఎలా ఉపయోగిస్తుంది వంటి విషయాలపై ఈ కోర్సు దృష్టి పెడుతుంది. దీనితో పాటు, 7 నిమిషాల వీడియో లెసన్ ,క్విజ్ కూడా ఉన్నాయి.
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పెనుముప్పు.. బిస్కెట్లు, చాక్లెట్లలో అధిక చక్కెర, ఉప్పు..!
- ఇంట్రడక్షన్ టు వెర్టెక్స్ ఏఐ స్టూడియో:
సమయం: 2 గంటలు.
ఎవరి కోసం: ఏఐ ప్రోటోటైపింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్పై ఆసక్తి ఉన్నవారికి.
విషయాలు: ప్రొటోటైపింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్ ,జనరేటివ్ ఏఐ వంటి ఒకే మాడ్యూల్ ఇందులో ఉంటుంది.
ఏఐలో నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా అద్భుతమైన కెరీర్ అవకాశాలను పొందవచ్చని, గూగుల్ ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.