365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 2,2026: ఒకప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ‘పెద్దల మాట’ వినేవారు లేదా ఫ్యామిలీ డాక్టరును సంప్రదించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనే అందరికీ ఆరోగ్యాన్ని బోధించే గురువు అయిపోయింది. 2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆరోగ్య సందేహాలపై ప్రత్యేక కథనం..
నెటిజన్లను వేధించిన ప్రధాన సందేహాలు..
జ్వరం వస్తే అదేనా?: “జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే అది సాధారణ ఫ్లూనా లేక కొత్త కోవిడ్ వేరియంట్ లక్షణాలా?” అనే ప్రశ్నపై శోధనలు వెల్లువెత్తాయి.
బీపీకి సహజ పరిష్కారం: “మందులు వాడకుండా రక్తపోటును (BP) సహజంగా ఎలా తగ్గించుకోవాలి?” అని కోట్లాది మంది ఆరా తీశారు.
మధుమేహంపై గురి: “డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?”,”ప్రీ-డయాబెటిస్‌ను వెనక్కి మళ్లించవచ్చా?” అనే ప్రశ్నలు టాప్ లిస్టులో ఉన్నాయి.

బరువు తగ్గించే ‘షార్ట్‌కట్’: కొత్తగా వస్తున్న ‘బరువు తగ్గించే ఇంజెక్షన్లు’ (Weight loss shots) సురక్షితమేనా? వాటి ధర ఎంత? అనే విషయాలపై యువతలో ఆసక్తి పెరిగింది.
మానసిక ప్రశాంతత కోసం: “మానసిక ఒత్తిడి (Stress), ఆందోళనను తక్షణమే తగ్గించుకోవడం ఎలా?” అనే శోధనలు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పాయి.
విటమిన్ల వేట: “శరీరంలో విటమిన్-డి, బి12 లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?” అని నెటిజన్లు ఎక్కువగా వెతికారు.
Read this alsoL&T Secures Major EPC Orders from SAIL to Fuel India’s Steel Expansion..
Read this also:Indian Real Estate Resurgence: PE Investments Surge 59% to $6.7 Billion in 2025..
ఇదీ చదవండి :పంచాయితీలను దత్తత తీసుకుని ‘అక్షర’ యజ్ఞం.. బీహార్‌లో సరికొత్త ప్రయోగం..!
నిద్రలేమి సమస్య: “రాత్రిపూట త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?” మరియు “ఇన్సోమ్నియాకు ఇంటి చిట్కాలు ఏవి?” అన్నవి హాట్ టాపిక్‌లుగా నిలిచాయి.
లివర్ ఆరోగ్యం: “ఫ్యాటీ లివర్ సమస్యను కేవలం ఆహారంతోనే నయం చేయవచ్చా?” అనే సందేహంపై కూడా సెర్చ్‌లు పెరిగాయి.

డిజిటల్ వైద్యం.. జరా జాగ్రత్త సుమా..!
గూగుల్‌లో సమాచారం సేకరించడం అవగాహన వరకు మంచిదే అయినా, చికిత్స విషయంలో మాత్రం డాక్టర్ల సలహా తప్పనిసరి. స్వయంగా వైద్యం (Self-medication) చేసుకోవడం ప్రమాదకరం.
