365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌,జూలై 17,2024: 15వ మాన్‌సూన్‌ రెగట్టా హోరాహోరీగా సాగుతోంది. హుస్సేన్‌ సాగర్‌‌ జలాల్లో జరుగుతున్న పోటీల్లో రెండో రోజు, మంగళవారం తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారు.

అండర్‌‌16 ఆప్టిమిస్ట్ క్లాస్ సబ్‌ జూనియర్ ఫ్లీట్‌ 12 రేసులకు గాను ఐదు రేసులు పూర్తయ్యే సరికి స్థానిక సెయిలర్‌‌ గోవర్ధన్ పల్లార తన మెరుపు వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు మూడు రేసుల్లో పోటీ పడ్డ గోవర్ధన్ ఒకదాంట్లో మొదటి స్థానం మరో రెండింటిలో 8, 4వ స్థానాలు సాధించాడు.

మొత్తంగా దేశవ్యాప్తంగా 39 మంది సెయిలర్లు బరిలో నిలిచిన ఈ విభాగంలో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీఎంసీ మైసూర్‌‌ సెయిలర్ ఆకాశ్‌ తంగై రెండో స్థనాంలో, తమిళనాడుకు చెందిన శ్రేయ కృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. అండర్‌‌–18 ఇంటర్నేషనల్ 420 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన వైష్ణవి వీరవంశం–శ్రావణ్ కేత్రావత్‌, తనూజ కామేశ్వర్‌‌–గణేవ్ పీర్కట్లా జంటలు పోటీపోటీగా తలపడుతూ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

అండర్‌‌18 ఐఎఎల్‌సీఏ 4 సింగిల్‌ స్కల్‌ హ్యాండర్ బాలికల విభాగంలో సోమ్యా సింగ్‌ (మధ్యప్రదేశ్‌), ఆలియా సబ్రీన్ (ఒడిశా) తొలి రెండు స్థానాల్లో ఉండగా. తెలంగాణకు చెందిన మాన్యా రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతోంది.

Also read :15th Monsoon Regatta the Telangana Sailors dominated the under 16 Optimist fleet with Govardhan Pallara

Also read : Encalm Hospitality Expands into accommodation services with Debut Transit Lounge at Rajiv Gandhi International Airport, Hyderabad.

Also read : NMDC hosts an interactive session on World PR Day..

ఇదికూడా చదవండి: పూజా ఖేద్కర్ తర్వాత మరొక ఫేక్ ఐఏఎస్ అధికారి..