365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,
జూన్ 25,2021 : అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు గోవర్థనగిరిధారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభను అధిష్టించిన స్వామిని దర్శించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.