Mon. Dec 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 22,2023: స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టపోయాయి. శుక్రవారం ఆసాంతం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రీబౌండ్‌ అయ్యాయి.

ఐరోపా మార్కెట్లు తెరవగానే మళ్లీ పతనం మొదలైంది. అమెరికా బాండ్‌ యీల్డులు పెరగడం, సుదీర్ఘ కాలంగా అత్యధిక స్థాయిలోనే వడ్డీరేట్లు కొనసాగడం, డాలర్‌ ఇండెక్స్ ఎగియడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

దాంతో వారు అప్రమత్తంగా ఉండాలని, నష్టభయం తగ్గించుకోవాలని లాభాల స్వీకరణ చేపడుతున్నారు.హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, భారత్‌ను మినహాయిస్తే ఆసియాలో అన్ని స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 221 పాయింట్ల మేర నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.

జేపీ మోర్గాన్‌ ప్రభుత్వ బాండ్‌ ఈల్డులు తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు విపరీతంగా పెరిగాయి. ఆటో రంగం ఫర్వాలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ మార్కెట్‌ నష్టాల్లో కీలకంగా మారాయి.

క్రితం సెషన్లో 66,230 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,215 వద్ద మొదలైంది. 65,952 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,445 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,744 వద్ద ఓపెనైంది. 19,657 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 68 పాయింట్లు తగ్గి 19,674 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 11 పాయింట్ల నష్టంతో 44,612 వద్ద ముగిసింది.

నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ను పరిశీలిస్తే 19,700 వద్ద సపోర్ట్‌, 19,830 వద్ద రెసిస్టెన్స్‌ ఉన్నాయి. మారుతీ సుజుకీ, ఎస్బీఐ, ఎల్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సుందర్‌ ఫైనాన్స్‌, బంధన్ బ్యాంకు, ఏయూ బ్యాంక్‌, జీఎస్‌పీఎల్‌ షేర్లను ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి కొనుగోలు చేయొచ్చు.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 20:30గా ఉంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.12%), ఎం అండ్‌ ఎం (1.69%) టాప్‌ గెయినర్స్‌. డాక్టర్‌ రెడ్డీస్‌ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్‌ (1.83%), సిప్లా (1.66%), బజాజ్‌ ఆటో (1.58%) టాప్‌ లాసర్స్‌.

రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకు 3 శాతానికి పైగా పెరిగింది. ఆటో రంగం లాభపడింది. రియాల్టీ, మెటల్‌, బ్యాంకు, ఫార్మా రంగాల సూచీలు 3-4 శాతం పతనమయ్యాయి. మిడ్‌క్యాప్‌, మీడియా, ఐటీ, ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు నష్టపోయాయి.

మొత్తంగా ఈ వారంలో పీఎస్‌యూ బ్యాంకు సూచీదే హవా. రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌, మెటల్‌, బ్యాంకు, ఫార్మా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తమ యూనిట్‌లో సర్వే చేపట్టిందని లక్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. లాభాలపై ప్రెజర్ ఉందని ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఇండియా అంచనా వేసింది.

ధంపూర్‌ షుగర్‌ మిల్స్‌ సీఈవో అనంత్‌ పాండే రాజీనామా చేశారు. స్విట్జర్లాండ్ టెక్నో ఎనర్జీతో రత్నమణి మెటల్స్‌ 51-49 పద్ధతిలో జాయింట్‌వెంచర్‌ నెలకొల్పింది. ఫార్మా కంపెనీలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో పవర్ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు 3-5 శాతం ఎగిశాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!