Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, మే 8, 2023: ఒకవేళ మే9 సాయంత్రం 5 గంటలలోపు తమ విధుల్లో చేరకపోతే, చేరని వారిని తొలగిస్తామని తెలంగాణ సర్కారు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ నోటీసులు జారీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ఆయా నోటీసుల్లో వెల్లడించారు.

ప్రభుత్వంతో జేపీఎస్ లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. “జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను” అని సంతకం చేశారు.

“ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ, జూనియర్ పంచాయితీ లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు.” “చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుంచి సమ్మెకు వెళ్ళారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జూనియర్ పంచాయితీలు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు”.


అయితే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో జెపిఎస్ లకు చివరి అవకాశాన్ని ఇస్తున్నది” అని, మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. “నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారు.” అని హెచ్చరించింది సర్కారు.

error: Content is protected !!