365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్, వరంగల్, ఫిబ్రవరి 2, 2025: వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించు కున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజల క్షేమాభివృద్ధి కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కొద్దిసేపు మాట్లాడిన ప్రభుత్వ విప్, భద్రకాళి అమ్మవారి మహిమ గురించి విశేషాలు వివరించారు.
ఇది కూడా చదవండి..వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్..
ఇది కూడా చదవండి..ఫిబ్రవరి19 నుంచి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రోమోనుషేర్ చేసిన స్పోర్ట్స్ స్టార్..
ఇది కూడా చదవండి..ETO మోటార్స్, ఫ్లిక్స్‌బస్ భాగస్వామ్యం – విద్యుత్ బస్సుల ప్రారంభం
ఇది కూడా చదవండి..హీరో ఈశ్వర్ ‘సూర్యాపేట్ జంక్షన్’ ట్రైలర్ విడుదల
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దేవాలయ అభివృద్ధికి నాకు తోచిన సహాయం అందిస్తాను” అని పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ కు అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా సత్కరించారు.