365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 10,2024: నిన్న తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన శుభదినం. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాం.
కానీ పదేండ్లుగా తెలంగాణ సాధించినా ఇప్పటికీ అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రకటించలేదు. కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళల గురించి కవిత మాట్లాడుతున్నప్పటికీ, మహిళా గవర్నర్‌ను దూషించిన ఘనత మీ పార్టీ నేతలకు దక్కింది.
ఆర్టీసీ బస్సులో డ్యాన్స్ చేయమన్న మీ అన్న కేటీఆర్ కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. కవులు, మేధావులతో చర్చించి నిన్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాం.

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‌ను ఆహ్వానించినా ఆయన హాజరుకాలేదు. అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవనానికి తరలిస్తామని చెప్పడం సిగ్గుచేటు.
పేదోళ్ల తల్లి, కవుల కళాకారులకు ప్రతీక Telangana తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే చాకలి ఐలమ్మ, ఉద్యమకారులు, పేదోళ్లు గుర్తుకొస్తారు. కానీ లిక్కర్ రాణి కవిత కూడా ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి మాట్లాడటం విచిత్రం.
తెలంగాణ తల్లి అంటే ఒకవైపు డబ్బు, మరొకవైపు లిక్కర్ సీసా ఉండాలని భావిస్తున్నారా? అమెరికా నుంచి వచ్చిన కవిత, “విగ్రహం నా లెక్క ఉండాలి” అని అంటోంది. కానీ గడిలోని తల్లి కాదు, గరీబోళ్ల తల్లి కావాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.

ఏనాడూ తెలంగాణ తల్లి గురించి ఆలోచించని మీరు ఇప్పుడు సెంటిమెంట్ గురించి మాట్లాడటం తగదా? మీ ఆరాచక పాలన, దొరల సంస్కృతి Telangana ప్రజలు ఎంతకాలం భరిస్తారు? అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు.
చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు.