365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 26, 2022: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని అన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం 9గంటలకు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ క్రమంలో శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గే దుర్గతి నాశని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా పలువురు అధికారులు పాల్గొన్నారు.