365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,4 డిసెంబర్ 2022: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. గౌ.గవర్నరుకు ఆలయ మహాద్వారం వద్ద టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ చనాలు ఇచ్చారు. అనంతరం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసా దాలు, డైరీ,క్యాలెండర్‌ను తెలంగాణ గవర్నర్ గారికి అందజేశారు.
రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివా రి దర్శనం చేసుకొనేందుకు అవకాశం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేశామని గౌ.గవర్నరుకు ఈఓ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాట్లాడుతు టిటిడి నిర్ణయం చాలా బాగుందని, అందుబాటులోకి వచ్చిన అదనపు సమయంలో ఎక్కువమంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని గవర్నర్ పేర్కోన్నారు .
ఇందులో డివైఇవో హరిద్రనాథ్, విజిఓ బాల్ రెడ్డి, ఆలయ పీష్కార్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.