Mon. Dec 23rd, 2024
Governor-Tamilisai

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 23,2022: వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ-హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణి స్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

Governor-Tamilisai

ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో… విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.

Governor-Tamilisai

కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. ఎంబిబిఎస్,ఎండి-డిజిఓ లాంటి వైద్య విద్య కోర్సులు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!