365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,ఫిబ్రవరి 7,2026: దేశీయ ప్రయాణ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌ల ఆధిపత్యానికి గండి కొడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భారత్‌ టాక్సీ’ (Bharat Taxi) యాప్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

డ్రైవర్లకు ‘సిరుల’ పండగ!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైవేటు యాప్‌లు డ్రైవర్ల సంపాదనలో 25 నుంచి 30 శాతం వరకు కమిషన్‌ రూపంలో వసూలు చేస్తున్నాయి. అయితే, భారత్‌ టాక్సీ ఈ కమిషన్‌ భారాన్ని భారీగా తగ్గించనుంది. కనీస కమీషన్‌.. డ్రైవర్ల నుంచి నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మెరుగైన ఆదాయం.. తక్కువ కమిషన్‌ వల్ల డ్రైవర్ల నికర ఆదాయం గణనీయంగా పెరగనుంది. నేరుగా ఖాతాల్లోకి..ప్రయాణికులు చెల్లించే సొమ్ము ఏజెంట్ల ప్రమేయం లేకుండా వేగంగా డ్రైవర్ల ఖాతాల్లో జమ అయ్యేలా సాంకేతికతను రూపొందించారు.

ఇదీ చదవండి..‘లింగ నిర్ధారణ’ శస్త్రచికిత్స ఎలా చేస్తారు..?

ఇదీ చదవండి..తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం..

ప్రయాణికులకు ఉపశమనం..

డిమాండ్‌ను బట్టి ధరలను అడ్డగోలుగా పెంచే ‘సర్జ్‌ ప్రైసింగ్‌’ (Surge Pricing) విధానానికి భారత్‌ టాక్సీ స్వస్తి పలకనుంది.

అతితక్కువ ఛార్జీలు..ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ధరలకే ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది.

Read this also:SBI Hits Record Performance: Q3 Net Profit Climbs 13% to Rs.21,317 Crore..

Read this also:India-US Trade Deal Deciphered – Winners, Protected Sectors, and Consumer Impact..

భద్రతకు పెద్దపీట.. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వల్ల ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మెరుగైన సర్వీసు..రద్దు (Cancellations) సమస్యలు తలెత్తకుండా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.

ఒక్క యాప్‌.. అనేక ప్రయోజనాలు..

దేశీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్‌ ద్వారా ఆటోలు, ట్యాక్సీలతో పాటు ఈ-రిక్షాలను కూడా అనుసంధానం చేయనున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో రూపొందిన ఈ వేదిక.. అసంఘటిత రంగంలోని లక్షలాది మంది డ్రైవర్లకు అండగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో ఓలా, ఉబెర్‌ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.