365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 16, 2025 : హోటల్ దస్పల్లాలో జరిగిన కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కలిసి, తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్ శ్రీమతి కాంతి వెస్లీ, ఐఏఎస్ సమక్షంలో, నగరంలోని పేద బాలికలకు ఉచితంగా హెచ్ పివి వ్యాక్సిన్లు అందించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమలు చేయనున్నారు.

శ్రీమతి కాంతి వెస్లీ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, తెలంగాణ క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మారాలని, సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధి వంశీ ముత్యపు, ప్రభుత్వ శాఖ నిర్వహణలోని అనాథ శరణాలయంలో చదువుతున్న 100 మంది బాలికలను కూడా వ్యాక్సిన్ కోసం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూల స్పందనగా, మార్చి 8న (ప్రపంచ మహిళా దినోత్సవం నాడు) అనాథ శరణాలయంలోని 100 బాలికలకు HPV వ్యాక్సిన్ ఇవ్వబడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి..ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా లక్షలు ఎలా సంపాదించాలి..?

ఇది కూడా చదవండి..ఫ్రెంచ్ ముద్దు: ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది..?

డాక్టర్ చిన్నబాబు తెలిపారు, “HPV వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌ను 100% నివారించవచ్చు. ఇది అత్యంత సరసమైన, స్వదేశీ తయారీ టీకా. మనం ప్రపంచం నుంచి పోలియోను నిర్మూలించినట్లే, గర్భాశయ క్యాన్సర్‌ను కూడా నిర్మూలిద్దాం.” అన్నారు.

ఈ HPV టీకా డ్రైవ్‌లో, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి, ఇన్ఫోసిస్ క్యాంపస్‌లతో నికటవున్న పోచారం, గచ్చిబౌలి, పరిసర ప్రాంతాలోని 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పేద బాలికలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద నేపథ్యాల నుంచి వచ్చే బాలికలూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమ వుతారని డాక్టర్ చిన్నబాబు వివరించారు.

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, క్యాన్సర్ భారం తగ్గించే గొప్ప లక్ష్యంతో స్థాపించిన లాభాపేక్షలేని సంస్థగా, నిరుపేదలకు చికిత్స, సంరక్షణ, కరుణను అందిస్తూ, సమాజంలో ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.