365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఏప్రిల్ 14,2025: హైటెక్ సిటీ గ్రీన్ హిల్స్ రోడ్‌పై సైబర్ సిటీ డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విల్లా వెర్డే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఘనంగా జరిగింది. లగ్జరీ లివింగ్‌కు ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభ వేడుకకు ప్రముఖులు, ఆహ్వానిత అతిథులు, కస్టమర్లు హాజరయ్యారు.

13.4 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 89 విల్లాలు ఉన్నాయి. ప్రతి విల్లా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌, 300 నుంచి 440 చదరపు గజాల వరకు విస్తరించి ఉండడం విశేషం. మూడు కార్ పార్కింగ్‌లు, టెర్రస్ స్విమ్ స్పా, ఇంటర్నల్ ఎలివేటర్‌తోపాటు బయోఫిలిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి.

Read this also…“Villa Verde: The Ultimate Luxury Villa Experience by CyberCity Builders & Developers at Green Hills Road, Hitec City”

ఇది కూడా చదవండి..అట్లాంటా(TAMA)లో ఉగాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జో శర్మ

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విల్లా వెర్డే వీడియో టూర్, స్కేల్ మోడల్‌ను ఆవిష్కరించారు. సైబర్ సిటీ గత 20 ఏళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించే వీడియోను ప్రదర్శించారు. ఈ వేడుకలో ది చార్‌కోల్ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.

సుస్సాన్ ఖాన్ స్థాపించిన చార్‌కోల్ ప్రాజెక్ట్‌ సహకారంతో బెస్పోక్ డిజైనింగ్ ఇంటీరియర్ ప్యాకేజీలు అందుబాటులో ఉండనున్నాయి. ఆధునికత, సొగసు, లగ్జరీ కలబోతగా ఉండే డిజైన్లు ఖాతాదారులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనున్నాయి.

విల్లా వెర్డే ప్రత్యేకతలు:

  • 30 మీటర్ల వెడల్పు గల గ్రాండ్ ఎంట్రెన్స్ గేట్
  • ప్రతి విల్లాకు కనీసం 3 కార్ పార్కింగ్‌లు
  • టెర్రస్‌లో స్విమ్ స్పా
  • రెయిన్ మాక్స్ టెక్నాలజీ ద్వారా నీటి సంరక్షణ
  • IGBC గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్
  • 12 అడుగుల డెక్‌లతో అవుట్‌డోర్ డిజైన్
  • 15కి పైగా ఇండోర్, 35కి పైగా అవుట్‌డోర్ సౌకర్యాలు
  • 1.4 ఎకరాల ఓపెన్ స్పేస్‌లు

Read this also…M4M Heroine Jo Sharma Adds Glamour to Atlanta Ugadi Celebrations

Read this also…Anna Lezhneva offers prayers at Tirumala; donates ₹17 lakh to temple trust on behalf of son Mark Shankar..

సైబర్ సిటీ విజయయాత్ర:
రియల్ ఎస్టేట్ రంగంలో రెండు దశాబ్దాలుగా విశ్వసనీయతకు నిలయంగా ఉన్న సైబర్ సిటీ డెవలపర్స్, 7500 కంటే ఎక్కువ కుటుంబాలకు లగ్జరీ నివాసాలను అందించింది. ఐజిబిసీ సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్‌తో స్థిరమైన అభివృద్ధికి ముందుంటోంది.

2025లో 20 సంవత్సరాల విజయోత్సవాలను జరుపుకుంటున్న ఈ సంస్థ, విల్లా వెర్డేతోపాటు మరో రెండు అద్భుత ప్రాజెక్టులను ప్రారంభించనుంది. లగ్జరీ లివింగ్‌ను నూతన దిశగా తీసుకెళ్లే ఈ ప్రాజెక్టులు సైబర్ సిటీ ప్రయాణంలో కొత్త మైలురాయిగా నిలవనున్నాయి.