365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 2,2025: 2025 కొత్త సంవత్సర వేడుకలు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో అట్టహాసంగా జరిగాయి.
ఈ వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, సిబ్బంది అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అందరి సహకారంతో గత డిసెంబర్‌లో నిర్వహించిన విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఉపకులపతి చెప్పారు. భవిష్యత్తులోనూ విశ్వవిద్యాలయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు విశ్వవిద్యాలయ అధికారులు, బోధన,బోధనేతర సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరూ హాజరై వేడుకలను మరింత ప్రాథాన్యం చేకూర్చారు.