365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 22,204: ఆటలు అనేవి బాల్యంలోనే ప్రారంభమవుతాయి, అందులో భాగంగా పిల్లలు వాటిలో భాగస్వామ్యం అవుతారు. ఈ ఆటలపై అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం ద్వితీయ వార్షికోత్సవాన్ని SPORTZEIT ELAZN 2024 పేరుతో ఘనంగా నిర్వహించారు.

గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 21వ తేదీన జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు కల్నల్ అనిల్ కుమార్, నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, ఇండియన్ మౌంటెనీర్ మలావత్ పూర్ణ, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ సుశీల్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుధ, డీపీఎస్, పీజీఓఎస్ సీఈవో మల్కా యశస్వి, బాచుపల్లి ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి హాజరయ్యారు.

గౌరవనీయులైన అనిల్ కుమార్ విద్యార్థులకు సందేశమిస్తూ, “విజయాన్ని సాధించాలంటే లక్ష్యసాధన ముఖ్యం, అలాగే ఆటలు ఆడేవారు నాయకత్వ లక్షణాలు, బాధ్యత, నిజాయితీ, సమదృష్టి కలిగి ఉండాలి” అని తెలియజేశారు.

నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, “క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాదు, ఇవి విజయం సాధించడానికి తొలిమెట్టు” అని చెప్పారు. పర్వతారోహణ చేసిన మలావత్ పూర్ణ మాట్లాడుతూ, “పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టిని సారించి కృషి చేయాలని” సూచించారు.

విద్యార్థుల మధ్య జరిగిన ఫైనల్ పోటీలలో, కోకో బాలికల మధ్య కబడ్డీ మరియు బాలుర మధ్య జరిగిన పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటీ క్షణాల సమయంలో ఆడిన తీరు సందర్శకులను ఆశ్చర్యపరచింది.

యూస్టా విద్యార్థులు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. EY-1 నుండి 7వ తరగతి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్, స్పార్కిల్ స్క్వాడ్, డాన్సింగ్ పెటల్స్, స్వే అండ్ స్ట్రైడ్, బాంబూ బీట్స్, ఫ్లాగ్ ఆఫ్ యూనిటీ వంటి అనేక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గౌరవనీయులైన కొమరయ్య, పల్లవి విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలలో కూడా శిక్షణ అందించి వారి విజయం సాధించడంలో సహాయం చేస్తామని చెప్పారు. డైరెక్టర్ సుశీల్, “ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యమే కాకుండా, ఏకాగ్రత, పట్టుదల, కార్యదీక్ష వంటి లక్షణాలు అలవడతాయి” అన్నారు.

అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుధ,మల్కా యశస్వి, “ఆటలు విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి మంచి వేదికగా పనిచేస్తాయని” తెలిపారు.

ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ మూర్తి ఆధ్వర్యంలో విజేతలు అవ్వడానికి యువ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు