Thu. Dec 26th, 2024

ముఖ్యాంశాలు:-

  • 2023 నవంబరులో కంపెనీని బీఎస్ఈలోని ఎస్ఎంఈ ప్లాట్‌ఫాం నుంచి బీఎస్ఈ లిమిటెడ్ మెయిన్ బోర్డుకు మార్చారు.
  • కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా కంపెనీ సబ్ డివైడ్ చేసింది.
  • కంపెనీ ఇటీవల పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ – ఎలిమెంటర్స్ ఫుడ్ స్ట‌ఫ్‌ఫ్ ట్రేడింగ్ ఎల్ఎల్సి, దుబాయ్, యు.ఎ.ఇ. ని ఇన్‌కార్పొరేట్ చేసింది.
  • తాజా పండ్లు ఉత్ప‌త్తిదారుల నుంచి దిగుమ‌తి చేసుకుని, వాటిని ‘గ్రోఫామియో’ అనే బ్రాండుతో హాస్పిటాలిటీ రంగంగ‌లోని కార్పొరేట్‌ల‌కు, ఈ కామ‌ర్స్‌కు పంపిణీ చేస్తోంది.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మే 15,2024: సీఏ విక్రమ్ బజాజ్ ప్రమోట్ చేసిన ముంబైకి చెందిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ గ్రోయింగ్టన్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ (బీఎస్ఈ – 539222) రాబోయే కాలంలో బలమైన వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

డిసెంబర్ 2023 తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం, 9 నెలలకు కంపెనీ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది, ఇది వృద్ధి వేగాన్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

2023 నవంబరులో, కంపెనీ బీఎస్ఈ వారి ఎస్ఎంఇ ప్లాట్‌ఫాం నుంచి బీఎస్ఈ లిమిటెడ్ వారి ప్రధాన బోర్డుకు మారింది. ఇందుకు కంపెనీ వాటాదారుల ఆమోదం కూడా పొందింది.

జులై 15న జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ ఈక్విటీ షేర్ల లిస్టింగ్/ట్రేడింగును బీఎస్ఈలోని ఎస్ఎంఈ ప్లాట్‌ఫాం నుంచి బీఎస్ఈ లిమిటెడ్ మెయిన్ బోర్డుకు మార్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని వాటాదారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదించారు.

2024 ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో కంపెనీ అద్భుతమైన ఆర్థిక గణాంకాలను నమోదు చేసింది. ఆదాయం 163 శాతం వృద్ధితో రూ.23.81 కోట్లకు చేరింది. నికర లాభం 328 శాతం వృద్ధితో రూ.1.75 కోట్లకు చేరింది.

error: Content is protected !!