365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6,2025 : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు కొత్త జీఎస్టీ నిబంధనలు పెద్ద షాకిచ్చాయి. ఇకపై డెలివరీ భాగస్వాముల తరఫున కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీలకు అదనంగా ఏటా రూ. 180-200 కోట్ల భారాన్ని మోపనుంది.
ఇది కూడా చదవండి…రూ.800 కోట్ల ఐపీఓ కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన యూకేబీ ఎలక్ట్రానిక్స్..
ఈ భారాన్ని డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల నుంచి వసూలు చేయాలని డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ కంపెనీలు యోచిస్తున్నాయి. దీంతో డెలివరీ భాగస్వాముల ఆదాయం తగ్గవచ్చు. కస్టమర్లకు కొత్త లెవీల పేరుతో అదనపు చార్జీలు పడవచ్చు.

గతంలో జొమాటోకు రూ. 803 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు రాగా, స్విగ్గీకి కూడా ఇలాంటి నోటీసే వచ్చింది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి ఒక పరిష్కారాన్ని ఇచ్చింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ అదనపు ఖర్చు చివరికి వినియోగదారుల మీదనే పడుతుంది.