365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 4,2025: హైదరాబాద్‌లోని ప్రముఖ యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థ గురు నానక్ యూనివర్సిటీ (GNU), ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (IST)తో కీలక వ్యూహాత్మక ఒప్పందం (MoU)పై సంతకాలు చేసింది.
విద్యా రంగంలో విశిష్టతను, వాస్తవ పరిశ్రమ అనుభవాన్ని మిళితం చేస్తూ అత్యాధునిక బీ.టెక్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.
Read This also…Google Maps Speedometer: Avoid Traffic Fines Easily..
Read This also…18Years Dream is Fulfilled..
ఈ భాగస్వామ్యం ద్వారా, GNU కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML)లతో కూడిన ఇండస్ట్రీ లింకేజ్ బీ.టెక్ ప్రోగ్రామ్‌లను అందించనుంది.
ఈ కోర్సులు విద్యార్థులకు ఆధునిక పాఠ్య ప్రణాళికలు, లైవ్ ప్రాజెక్టులు, ప్రత్యక్ష పరిశ్రమ అనుభవం ద్వారా విద్య, ఉపాధి అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని పూరించేందుకు రూపొందించబడ్డాయి.
ఇంటెలిపాట్ సీఈఓ దివాకర్ చిట్టోరా ఏమన్నారంటే..
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఇంటెలిపాట్ సీఈఓ, వ్యవస్థాపకుడు దివాకర్ చిట్టోరా, “ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు విద్యా రంగం, టెక్నాలజీ పరిశ్రమల ఉత్తమ అంశాలను పొందుతారు.
పరిశ్రమ ఆధారిత మాడ్యూల్స్, నిరంతర ప్రాజెక్ట్-ఆధారిత అభ్యాసం, వాస్తవ ప్రపంచ అనుభవం విద్యార్థులను మొదటి రోజు నుండే ఉద్యోగాలకు సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా, చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉండడం ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది.
ఇప్పటికే వేలాది మంది ఇంటెలిపాట్ విద్యార్థులు అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల్లో ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు పొందారు. GNU లో విద్యార్థులు పరిశ్రమ నిపుణులు, ఐఐటీ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ లీడర్ల నుంచి శిక్షణ పొందుతారు.
వారు టాప్ ఐటీ ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యాలను నిర్మించుకుంటారు. విద్యార్థులు ఐహబ్ ఐఐటీ రూర్కీ, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లు పొందటమే కాకుండా, ఐఐటీ రూర్కీలో 2 రోజుల క్యాంపస్ ఇమర్షన్‌లో కూడా పాల్గొనవచ్చు” అని వివరించారు.
గురు నానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. హెచ్.ఎస్. సైనీ..
గురు నానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ, “ఇది GNU కు ఒక గొప్ప మైలురాయి. ఇంటెలిపాట్‌తో మా భాగస్వామ్యం ద్వారా, విద్యార్థులు అత్యంత ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన కోర్సులను నేర్చుకోగలుగుతారు.

పరిశ్రమ నిపుణులు మా విద్యార్థులకు తరచూ గెస్ట్ లెక్చర్లు ఇస్తారు, తద్వారా వారు తాజా టెక్నాలజీలు, పరిశ్రమ పద్ధతులపై అవగాహన పెంచుకోగలుగుతారు.
Read This also…Google Maps Speedometer: Avoid Traffic Fines Easily..
Read This also…18Years Dream is Fulfilled..
ఇంటెలిపాట్ రూపొందించిన మాడ్యూల్స్, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ మద్దతు ద్వారా మా విద్యార్థులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. వారు పరిశ్రమకు సిద్ధంగా తయారవుతారు” అని పేర్కొన్నారు.
ఈ ఒప్పందంపై దివాకర్ చిట్టోరా (ఇంటెలిపాట్ సీఈఓ)డా. హెచ్.ఎస్. సైనీ (GNU వైస్ చాన్స్‌లర్) లు బోధనా సిబ్బంది, విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా సంతకాలు చేశారు.
ఈ భాగస్వామ్యం, ఆధునికతను కలిగి ఉన్న, భవిష్యత్‌కు సిద్ధమైన విద్యను అందించాలనే GNU నిబద్ధతను, అలాగే విద్యా రంగం, పరిశ్రమ మధ్య ఉన్న ఖాళీని పూరించాలనే ఇంటెలిపాట్ లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది.