Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జులై 3,2023: గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి అని డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణ వేణి అన్నారు. జులై 3న గురు పూర్ణిమ సందర్భంగా సందర్భంగా ఇందిరా పార్క్ లో ఉదయం 7.30 గంటలకు డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భారతీయ యోగ సంస్థాన్ ఇందిరా పార్క్ యోగ గురువులు బొబ్బిలి సరోజని, బొబ్బిలి రామారావు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.కృష్ణ వేణి, కే. సరస్వతి, డా.గీత, పి.స్వరూపా రాణి, యశోద, శ్రీలత, శారద, అనిత, ఉషా, జ్యోతి, ధనలక్ష్మి, పూర్ణ, పవన్, ప్రకాష్, ఇంద్రజిత్, దేవేందర్ ,జయప్రకాష్, అడ్వకేట్ రాజేంద్ర కుమార్, ప్రకాష్, రాజు నరసింహ సింగ్ పాల్గొన్నారు.

అమ్మా, నాన్న ప్రేమను అందిస్తే గురువులు విజ్ఞానం, ఆరోగ్యం, ఆనందాలు ఇస్తారన్నారు. యోగ ద్వారా ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, శిక్షకులను తయారు చేస్తున్న గొప్ప మానవతా విలువలు కలిగిన గురువులు సరోజని, రామారావు అని పలువురు కొనియాడారు.

ఈ రోజున కేవలం గురువే కాదు, కుటుంబ పెద్దలైన తల్లిదండ్రులు, తోబుట్టువులు మొదలైన వారిని కూడా గురువుతో సమానంగా పరిగణించాలన్నారు. మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసేందుకు పండుగను స్వచ్ఛమైన హృదయంతో, విశ్వాసంతో అందరూ జరుపుకోవాలనికోరారు.

డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ హిప్నో థెరపీస్ట్
@ 9390044031

error: Content is protected !!