365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై, మే 21 2025: స్థిరమైన నిర్మాణ రంగంలో మరో కీలక మెట్టు ఎక్కుతూ, సెయింట్-గోబైన్ జిప్రోక్ ఇండియా దేశంలోనే తొలిసారిగా తక్కువ కార్బన్ గల జిప్సం ప్లాస్టర్‌పై పర్యావరణ ఉత్పత్తి ప్రకటన (EPD) ని ఆవిష్కరించింది. ఈ ప్రగతిశీల ఆవిష్కరణ ఏప్రిల్ 2024లో ప్రారంభమైన తక్కువ కార్బన్ ప్లాస్టర్‌కు సంబంధించింది. ఇది నిర్మాణ రంగాన్ని పర్యావరణపరంగా మరింత భద్రంగా మార్చే దిశగా కీలకమైన అడుగు.
జిప్రోక్ ఇండియా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో EPD వెరిఫైడ్ సర్టిఫికేట్‌తో పాటు తక్కువ కార్బన్ గుర్తింపుతో కూడిన కొత్త ప్యాకేజింగ్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు హాజరయ్యారు. అనంతరం జిప్రోక్ ప్లాస్టర్లు, వెబర్ ఉత్పత్తుల తయారీ సౌకర్యాలకు ప్రత్యేక టూర్ నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిప్రోక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుదీప్ కోల్టే మాట్లాడుతూ – “స్థిరత్వం మాకు ఒక లక్ష్యం కాదు, అది మేము చేసే ప్రతిదానికీ కేంద్రబిందువు. భారతదేశపు మొట్టమొదటి తక్కువ కార్బన్, EPD ధృవీకరణ పొందిన ప్లాస్టర్‌లతో పర్యావరణ బాధ్యతను మరిచిపోలేని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు.
జిప్రోక్ ప్లాస్టర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ త్రిదివ్ ఓజా మాట్లాడుతూ – “ఈ ప్రణాళిక ద్వారా నిర్మాణ రంగంలో ఉన్న మా భాగస్వాములతో కలిసి స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం. ప్లాంట్ సందర్శనలో వాటాదారుల విశ్వాసం, ఆసక్తి మా ఉత్పత్తుల నాణ్యతను మరింత ముద్ర వేసింది” అన్నారు.
EPD ధృవీకరణ పొందిన తక్కువ కార్బన్ జిప్సం ప్లాస్టర్లు – ఎలైట్ 100, ఎలైట్ MR, ఎక్స్‌పర్ట్+ – పేరుతో లభ్యమవుతాయి. ఇవి అధిక పనితీరు, పర్యావరణ అనుకూలత కలిగిన నిర్మాణ సామగ్రిగా రూపుదిద్దుకున్నాయి.
చెన్నైలోని ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంలో ఈ ప్లాస్టర్లు అభివృద్ధి చేయబడ్డాయి. పునరుత్పాదక శక్తిని వినియోగిస్తూ తక్కువ ప్రభావం కలిగే ప్రక్రియల ద్వారా తయారు చేయబడిన ఈ ఉత్పత్తులు, దేశంలోనే కాకుండా గ్లోబల్‌గా సెయింట్-గోబైన్ నెట్‌వర్క్‌లో తక్కువ కార్బన్ ప్లాస్టర్ తయారీకి మార్గదర్శకంగా నిలిచాయి.

ఈ ఆవిష్కరణతో జిప్రోక్ ఇండియా పర్యావరణ పరిరక్షణ, నిర్మాణ నాణ్యత రెండింటికీ నూతన ప్రమాణాలు స్థాపించింది.
ఈ ప్రారంభోత్సవం సెయింట్-గోబైన్ “ప్రపంచాన్ని ఒక చక్కని గృహంగా మార్చడం” అనే గొప్ప ఆదర్శాన్ని బలంగా చాటింది.కొత్తదనం, పారదర్శకత,సహకారం ద్వారా స్థిరమైన నిర్మాణానికి గ్రూప్ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుంది. జిప్రోక్ ఇండియా తక్కువ కార్బన్ ప్లాస్టర్లు స్థిరత్వ ప్రయత్నాల గురించి మరింత సమాచారం కోసం, సందర్శించండి [https://www.gyproc.in/].