Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి, ఏప్రిల్ 1,2022: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంస‌ వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవ ఆల‌య నాలుగు మాడ వీధుల్లో రాత్రి 10 గంటల వరకు జరగనుంది.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

error: Content is protected !!