hanumanthavahanam
hanumanthavahanam

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 16,2022: అప్పలాయ గుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధ‌వారం హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

hanumanthavahanam

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. మ‌ధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన మివ్వనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.