Sat. Dec 14th, 2024
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుపతి,జులై 14,2021: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవంలో రెండో రోజైన బుధ‌వారం రాత్రి స్వామివారికి హ‌నుమంత వాహ‌నంపై ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హించారు.

HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM

అనంతరం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు హ‌నుమంత వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఆస్థానం చేప‌ట్టారు. జులై 15న గరుడ వాహన‌సేవ ఆస్థానం జ‌రుగ‌నుంది.

HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
HANUMANTHA VAHANA SEVA IN EKANTAM
error: Content is protected !!