Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 6,2023: సౌమ్య మీనన్ దక్షిణ భారత చలనచిత్ర నటి.. అంతేకాదు మోడల్ కూడా. ఆమె ప్రధానంగా మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె 2018 మలయాళ చిత్రం కినావల్లి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

చిల్డ్రన్స్ పార్క్, మార్గంకాళి, ఫ్యాన్సీ డ్రెస్ అనే మలయాళ చిత్రాలలో కూడా ఆమె ప్రధాన పాత్రను పోషించి తనదైన ముద్ర వేసింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు కాబట్టి ఆమెకు బర్త్ డే విషెస్ చెబుదాం..

సౌమ్య మీనన్.. మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆయన పక్కన నటించాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ కూడా చేసింది ఈ కేరళ కుట్టి. ఆ సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది.

శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘ సర ‘ ( SARA )లో సౌమ్య మీనన్ టు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీలో ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించని బ్యాక్ డ్రాప్ లో వి.శశిభూషణ రైటింగ్ అండ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నట్టు వారు వెల్లడించారు.

మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టెక్నీషియన్స్ పేర్లన్నీ త్వరలోనే రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కట్టిపడేసే అందంతో పక్కింటమ్మాయిలా కనిపించే సౌమ్య మీనన్, హీరోయిన్ ఒరియంటెడ్ మూవీ ‘ సర ‘ లో ఖచ్చితంగా మూవీ లవర్స్ ని అలరిస్తుందని ఆశిస్తూ ఈ బ్యుటీకి మరోసారి హాపీ బర్త్ డే చెబుదాం మరి..

error: Content is protected !!