Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 4,2023: రాబోయే పండుగ సీజన్‌లో కస్టమర్‌లకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, తన మొదటి సహ-అభివృద్ధి చెందిన ప్రీమి యం మోటార్‌సైకిల్ హార్లీ డేవిడ్ సన్ X440 డెలివరీని నవరాత్రి పండుగ మొదటి రోజున అంటే, 15 అక్టోబర్ 2023 న ప్రారంభించనుంది.

హార్లీ డేవిడ్ సన్ X440 ప్రస్తుతం ఉత్తర భారత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని నీమ్రానాలో – గార్డెన్ ఫ్యాక్టరీ అని పిలుచే హీరో మోటో కార్ప్ తయారీ కేంద్రం వద్ద తయారు చేయనుంది. కంపెనీ 1 సెప్టెంబర్ 2023 నుంచి ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్ల కోసం టెస్ట్ రైడ్‌లను నిర్వహిస్తోంది.

కొత్త బుకింగ్ విండో అక్టోబర్ 16 నుంచి తెరవనుంది. వినియోగదారులు కొత్త హార్లీ డేవిడ్ సన్ X440 ని అన్ని హార్లీ డేవిడ్ సన్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ అవుట్‌లెట్‌లను ఎంచుకోవచ్చు. www.Harley-Davidsonx440.comని సందర్శించడం ద్వారా కస్ట మర్‌లు ఆన్‌లైన్‌లో మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, ‘‘హార్లీ డేవిడ్ సన్ X440 దేశవ్యాప్తంగా సంతోషాన్ని నింపుతుంది. మా నీమ్రానా సదుపాయంలో ఉత్పత్తి పూర్తి జోరుగా సాగుతోంది.

మా ప్రీ-బుక్ చేసిన కస్టమర్లలో భారీ సంఖ్యలో మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని పొందారు. నవరాత్రి మొదటి రోజు నుంచి మా కస్టమర్‌ల కు హార్లీ డేవిడ్ సన్ X440 డెలివరీలను ప్రారంభించడం ద్వారా పండుగ సంతోషాన్ని నింపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.

https://www.harley-davidsonx440.com/

ఇది మా ప్రీమియం ప్రయాణంలో ప్రారంభం మాత్రమే’’ అని నిరంజన్ గుప్తా అన్నారు.జూలై 2023లో ఆవిష్కరించినప్పటి నుంచి, హార్లీ డేవిడ్ సన్ X440 భారతదేశం అంతటా ప్రీమియం సె గ్మెంట్ కస్టమర్‌లను ఆకర్షించింది.

తద్వారా తన ప్రదర్శన నుంచి కేవలం ఒక నెలలోనే 25000 బుకింగ్‌ల ను సాధించింది. హీరో మోటోకార్ప్ మొదటి సెట్ కస్టమర్‌లను అందించడాని కి ఆన్‌లైన్ బుకింగ్ విండోను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది.

మోటార్‌సైకిల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది – డెనిమ్, వివిడ్, S. వీటి ధరలకు వరుసగా రూ. 2,39,500/- (డెనిమ్), INR 2,59,500/- (వివిడ్),రూ. 2,79,500/- (S).

error: Content is protected !!