365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2025: హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాది వికాస్‌ను సైబర్ దొంగలు భారీగా మోసం చేశారు. క్రెడిట్ కార్డ్ అప్డేట్ పేరుతో వచ్చిన ఒక్క కాల్తోనే అతని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు నుంచి ₹82,893.77 దోచేశారు..
వికాస్ (డాల్ఫిన్ అపార్ట్మెంట్స్ నివాసి)కి ఒక రోజు ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగిని అని పరిచయం చేసుకున్నాడు. “మీ స్కైపియా క్రెడిట్ కార్డ్ దరఖాస్తును కార్డ్-టు-కార్డ్ బదిలీ ద్వారా ఆమోదిస్తాం” అని మోసపూరితంగా చెప్పాడు.
ఆ తర్వాత “మీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్టేట్మెంట్ ఇమెయిల్‌కి పంపండి” అని అడిగాడు. ఆ ప్రకారం వికాస్ స్టేట్మెంట్ పంపగానే… మోసగాడు ఒక లింక్ ఇమెయిల్ చేశాడు.
వికాస్ ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ అయింది. కాసేపటికే అతని మొబైల్‌కు మెసేజ్ వచ్చింది – “మీ అకౌంట్ నుంచి ₹82,893.77 డెబిట్ అయింది..

అప్పుడే వికాస్‌కు విషయం అర్థమైంది – ఇదంతా సైబర్ మోసమేనని..
తక్షణమే పంచకుల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు అధికారి ఎస్ఐ భూప్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్లు డబ్బు బదిలీ చేసిన ఖాతాలను ట్రాక్ చేస్తూ… సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మారో సారి ఈ తప్పు చేయద్దు..
ఎవరైనా బ్యాంక్ పేరుతో లింక్ పంపితే క్లిక్ చేయొద్దు!
క్రెడిట్ కార్డ్ వివరాలు, OTP ఎవరికీ షేర్ చేయొద్దు!
సైబర్ మోసాల నుంచి కాపాడుకోవాలంటే అప్రమత్తంగా ఉండటమే మార్గం!
