365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 30, 2025 : ఉద్యోగ ప్రదేశాలు, పారిశ్రామిక కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కాపాడడం ఇప్పుడు అత్యంత కీలకం. ప్రమాదాలను నివారించేందుకు, భద్రతా ప్రమాణాలను పెంపొందించేందు కు స్పష్టమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన సిగ్నేజెస్ అవసరం. ఈ విషయంలో హెచ్ బి ఎస్ సిగ్నేజెస్ ముందంజలో ఉంది. ఆధునిక సాంకేతికత, ఉత్తమ నాణ్యతతో రూపొందించిన ఈ సిగ్నేజ్‌లు, భద్రతా సమాచారాన్ని సమర్థవంతంగా ప్రసారం చేసి, ప్రాణాలను కాపాడేలా మారుతున్నాయి.

ఉద్యోగ ప్రదేశాలు, పారిశ్రామిక కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రత అత్యవసరం. ఈ నేపథ్యంలో, హెచ్ బి ఎస్ సిగ్నేజెస్ సంస్థ భద్రతా ప్రమాణాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆధునికతతో కష్టమైజ్ చేసిన సిగ్నేజ్ సొల్యూషన్స్ ను అందిస్తోంది.
హెచ్ బి ఎస్ సిగ్నేజ్ ప్రత్యేకతలు..

✅ స్పష్టమైన భద్రతా సూచనలు, అత్యవసర మార్గదర్శకాలు
✅ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా
✅ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన
✅ రంగు కోడ్‌లు, చిహ్నాల ద్వారా భాషా అవరోధాలు లేకుండా స్పష్టమైన కమ్యూనికేషన్
✅ అధిక నాణ్యత, మన్నిక గల పదార్థాలతో తయారీ

హెచ్ బి ఎస్ సిగ్నేజెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ దాచెపల్లి హరీష్ మాట్లాడుతూ.. “భద్రత అనేది కేవలం నిబంధన కాదు, ఇది ప్రజల రక్షణకు అవసరం. మేము వినూత్నమైన, సులభంగా అర్థమయ్యే భద్రతా పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.హెచ్ బి ఎస్ సిగ్నేజెస్ భద్రతా ప్రమాణాలను పెంచడమే కాకుండా, భద్రతా సంస్కృతిని కొత్తస్థాయికి తీసుకెళ్తోంది.