365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 7 ఏప్రిల్, 2022: తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు,వాణిజ్యం విభాగం, భారతదేశ ప్రముఖ ఎఫ్ఎం సీజీ కంపెనీల్లో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్ సిసిబి) నేడిక్కడ నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యాల పెంపు,ఉపాధి అవకాశాల కల్పనకు, నైపుణ్యాల నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఒ యు) పై సంతకాలు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీలక పారిశ్రామిక విధానాన్ని కలిగిఉంది. రైతుల ఆదాయం అధికం చేయడం, ఆహార వృథాను తగ్గించడం, విలువ జోడింపును మెరుగుపర్చడం లక్ష్యంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది.
అందుకే ఈ భాగస్వామ్యం ప్రస్తుత,రాబోయే పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చనుం ది.రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వద్ద తన రెండో ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు కూ డా హెచ్ సిసిబి ప్రకటించింది. అత్యాధునిక, Digital కేంద్రిత, ఆటోమేటెడ్, Smart Factoryని నెలకొల్పేందుకు గాను మొదటి దశలో కంపెనీ రూ.600 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. జ్యూస్ లు, ఎన్ హేన్స్ డ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్, స్పార్క్లిం గ్ బేవరేజెస్ ను ఈ ఫ్యాక్టరీ తయారు చేయనుంది. సనంద్ (గుజరాత్),రాణినగర్ (పశ్చిమ బెంగాల్)లలో కంపెనీ నెల కొల్పిన రెండు నూతన ఫ్యాక్టరీలలో 40% మంది,65% (వరుసగా) మంది మహిళలలు పని చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఈ Digital, Smart Factory మహిళా ఉపాధి అవకాశాలను కూడా అధికం చేయనుంది. బండ తిమ్మాపూర్ లోని హెచ్ సిసిబి ఫ్యాక్టరీ 2023 చివరి నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధం కానుం ది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసి) ఇప్పటికే ఈ ఫుడ్ పార్క్ లో హెచ్ సిసిబికి 48.53 ఎకరా ల స్థలంలో ప్లాట్ ను కేటాయించింది.
గౌరవనీయ తెలంగాణ మునిసిపల్ పాలనావ్యవహారాలు, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు,
వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, క మ్యూనికేషన్ శాఖ మంత్రి, కేటీ రామారావు, ఐఏఎస్ అధికారి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ లసమక్షంలో కోకా-కోలా కంపెనీ బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రొడ్రిగ్యుజ్, హిందుస్థాన్ కోక-కోలా బేవరేజెస్ చైర్మన్,సీఈఓ నీరజ్ గార్గ్ ఈ ప్రకటన చేశారు.హెచ్ సిసిబి 25 వార్షికోత్సవాలకు ఈ ప్రకటన మరిన్ని మెరుపులను జోడించింది.అమీన్ పూర్ లో కంపెనీ ఇప్పటికే ఒక మెగా ఫ్యా క్టరీని నిర్వహిస్తోంది.
కేటీ రామారావు కంపెనీ ప్రకటనలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ, ‘‘గత రెండు దశాబ్దా లుగా రాష్ట్రంలో హెచ్ సిసిబి ఉనికిని తెలంగాణ
గౌరవిస్తూ వచ్చింది. రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లుగా సంస్థ 25వ
వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించడం, వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్రంతో హెచ్ సిసిబి అను బంధాన్ని మరింత ప్రగాఢం చేస్తుంది.
25 ఏళ్ల మైలురాయిని దాటుతున్నందుకు గాను కంపెనీ, సిబ్బంది, దాని భాగస్వాము లందరికీ నా అభినందనలు. హెచ్ సిసిబి వంటి పెద్ద కార్పొరేషన్ రాష్ట్రంలో
తిరిగి పెట్టుబడులు పెట్టాలని నిర్ణ యించుకోవడం అనేది తెలంగాణలో వ్యాపారం
సులభరీతిలో జరగడాన్ని తెలియజేస్తుంది. ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్నినింపే విధానాలు కలిగిన భారతదేశపు అత్యంత ప్రగతిశీలక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని ప్రజల ప్రగతికి పారిశ్రామిక ఎదుగుదల, అభివృద్ధి సుస్థిరదాయక విధానంలో జరగాల్సి ఉందనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం.మేం అనుసరి స్తున్న విధానాల కారణంగానే తెలంగాణ యావత్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద, ప్రఖ్యాత కార్పొరెట్ సంస్థ లకు నిలయంగా మారింది. మీరంతా కూడా మా రాష్ట్రానికి ప్రచారకర్తలు కావాలని మేం కోరుకుంటున్నాం. హెచ్ సిసిబి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మేం కోరుకుంటున్నాం.
అదే సమయంలో ఇతర సంస్థలు సైతం ఇక్కడికి రావాలని, తమ ఉనికిని పటిష్టం
చేసుకోవాల్సిందిగా మేం వాటిని స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి ఐఏఎస్ అధికారి శ్రీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రగతిశీలకమైందిగా గుర్తింపు పొందడం పరిశ్రమలు, వాణిజ్యం విభాగానికి ఎంతో గర్వకారణం. ఈ రోజున హెచ్ సిసిబితో సంతకాలు జరిగిన ఈ అవగాహన ఒప్పందాలు పరిశ్రమ, రాష్ట్రం అభివృద్ధికి సంబంధితులందర్నీ ఒకే చోటుకు మేం ఎలా తీసుకువస్తున్నామనే అంశాన్ని తెలియజేస్తుంది. ఒక వైపున ఈ రెండు పక్షాలు కూడా ప్రస్తుత, రాబోయే ము మ్మర నీటి వినియోగ పరిశ్రమల కోసం సామర్థ్యాల నిర్మాణాన్ని అందించనున్నాయి, వ్యర్థజలాల నిర్వహణను, పునర్ వినియోగాన్ని మెరుగుపర్చనున్నాయి. మరో వైపున తెలంగాణ ప్రభుత్వం, హెచ్ సిసిబి రెండేళ్లలో 10,000 మందికి పైగా యువతకు నైపుణ్యాల శిక్షణను అందించనున్నాయి. ఈ తయారీ కేంద్రం కోసం, ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా, రై తు ఉత్పత్తిదారుల సంస్థలతో వ్యాపార అనుబంధాల ద్వారా స్థానిక విక్రేతలు నిలదొక్కుకునేందుకు కూడా మేం అండ గా నిలువనున్నాం’’ అని అన్నారు.
హెచ్ సిసిబి చైర్మన్, సీఈఓ శ్రీ నీరజ్ గార్గ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రాష్ట్రం నుంచి మాకు లభిస్తున్న మద్దతు, ప్రో త్సాహాలను మేమెంతగానో గౌరవిస్తాం. నూతన గ్రీన్ ఫీల్డ్ పై మేం త్వరలోనే పని చేయడం ప్రారంభిస్తాం. 2023లోగా దా న్ని తెలంగాణ ప్రజలకు అంకితమిస్తాం. ఫ్యాక్టరీలో స్త్రీ, పురుషులకు సమాన ప్రాతినిథ్యం లభించేలా చేయడం మా ఆశ యం. ప్రభుత్వంతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యా ల పట్ల కూడా నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఏళ్లుగా మేం తగి న రీతిలో నీటి వినియోగం, ప్లాస్టిక్ తో సహా ఘనవ్యర్థాల నిర్వహణ, మా కెరీర్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా చదువుకున్న, నిరుద్యోగ యువతకు నైపుణ్యాల శిక్షణ రంగాల్లో గణనీయ అనుభవం సాధించాం. మా నైపుణ్యం ద్వారా మరె న్నో పరిశ్రమలు ప్రయోజనం పొందడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు. కోకా- కోలా కంపెనీ బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ జువాన్ పాబ్లో రొడ్రిగ్యుజ్ ఈ సందర్భం గా మాట్లాడుతూ,‘‘భారతదేశంపై మేమంతా ఎంతో ఆసక్తితో ఉన్నాం.
భవిష్యత్ విజయాలకు గాను ముందెన్నడూ లే నంత మెరుగైన స్థానంలో ఈ మార్కెట్ ఉంది. అధునాతన సాంకేతికత, నైపుణ్యం, జనాభా తీరుతెన్నులు లాంటి ప్రయో జనాలన్నిటినీ ఇది కలిగిఉంది. హెచ్ సిసిబి వంటి కంపెనీల పెట్టుబడులు ఉభయతారక అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. మాపెట్టుబడులు బహుముఖ ఆర్థిక ప్రభావాలకు దారి తీస్తాయి. మా సరఫరాదారులు,రవాణాదారు లు, ముడిపదా ర్థాల నిర్వాహకులు, మానవ వనరుల భాగస్వాములు అంతా కూడా అదనపు వనరులను పెట్టుబడిగా పెడుతారు. అం తేగాకుండా సుస్థిరదాయకత, సీఎస్ఆర్ లపై కూడా దృష్టి పెడుతారు. భారతదేశవ్యాప్తంగా 25 లక్షల మొక్కలను నాటా లనే ఇటీవలి ప్రయత్నాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మనమంతా కలసి భారతదేశంలో
ప్రజలకు మరింత మెరుగైన భవితను అందిద్దాం’’ అని అన్నారు.
నేడు కుదిరిన అవగాహన ఒప్పందాల్లోని ముఖ్యాంశాలు
- నీటిని ముమ్మరంగా వాడే ప్రస్తుత, రాబోయే పరిశ్రమలకు నీటి సామర్థ్యం
పెంచేందుకు, వ్యర్థజలాల నిర్వహణ, పునర్వినియోగం కోసం వాటికి
సామర్థ్యాల నిర్మాణాన్ని అందించనున్న హెచ్ సిసిబి
హెచ్ సిసిబి ఈ విధంగా చేయాలని ప్రతిపాదించబడింది:
- తెలంగాణ ప్రభుత్వానికి చెందిన విభాగాలు, కార్యక్రమాలతో కలసి
పనిచేయడం ద్వారా నీటి వినియోగ పరిశ్రమలకు ఆన్ లైన్ కెపాసిటీ
బిల్డింగ్ సెషన్స్ నిర్వహించడం - నీటి సంరక్షణ, రీసైకిల్, పునర్వినియోగం, రిప్లెనిష్ మెంట్ టెక్నిక్స్,
వాటర్ షెడ్ ను కాపాడుకోవడం వంటి అంశాల్లో పాటిస్తున్న విధానాలను
చూసేందుకు అమీన్ పూర్ లోని ఫ్యాక్టరీని చూసే అవకాశాన్ని పరిశ్రమ కు
చెందిన వారికి కల్పించడం - ఫ్యాక్టరీలో, ఇతర ప్రాంతాల్లో హెచ్ సిసిబి నిర్మించిన నీటి సంరక్షణ
నిర్మాణాల సందర్శనకు వీలు కల్పిం చడం - ఉమ్మడి జలవనరులను ముప్పు కలిగించనివిగా చేయడం, నిర్వహించడంలో ఎంపిక చేసిన నీటి సంబంధి త సంస్థలతో (సీఐఐ త్రివేణి, గ్రీన్ కో, ఏఎస్ సిఐఐ,
పీసీబీ తెలంగాణ వంటివి) కలసి ఆచరణీయ విధానాల పై షార్ట్ లిస్ట్ తయారు
చేయడం - నీటిపై సర్క్యులర్ ప్రోగ్రామ్ సుస్థిరదాయక అమలు, పర్యవేక్షణ గాను
సంబంధిత వర్గాలతో కలసి కార్యా చరణ ప్రణాళిక రూపకల్పనలో తోడ్పాటు
- ఘన వ్యర్థాల నిర్వహణ మెరుగుకు తెలంగాణలోని ప్రస్తుత, రాబోయే కంపెనీలకు హెచ్ సిసిబి చే సామర్థ్యాల నిర్మాణం హెచ్ సిసిబి ఈ విధంగా చేయాలని ప్రతిపాదించబడింది:
- వ్యర్థాలను వేరు చేయడం, అకౌంటింగ్, అధీకృత వెండర్ల ద్వారా
డిస్పోజల్ కు సంబంధించి కంపెనీ అనుస రిస్తున్న విధానాలను
తెలుసుకునేందుకు హెచ్ సిసిబి ఫ్యాక్టరీ సందర్శనకు వీలు కల్పించడంతో
పాటుగా ఆన్ లైన్ కెపాసిటీ బిల్డింగ్ సెషన్ నిర్వహించడం - పర్యావరణంలోని ప్లాస్టిక్స్ పై, ఉత్పత్తిదారుల బాధ్యతలపై,
వ్యర్థాలపై అవగాహన సెషన్స్ నిర్వహించడం - రీసైక్లింగ్ భాగస్వాములు – వ్యర్థాల నిర్వహణ సంస్థలు, నిపుణులతో
చర్చలు. వేస్ట్ వాల్యూ చెయిన్ పై అ వగాహన కల్పించేందుకు గాను
మెటీరియల్ రికవరీ /రీసైక్లింగ్ కేంద్రాలు / అగ్రిగేషన్ సెంటర్లు లాంటి
వా టికి సందర్శనలను నిర్వహించడం - వ్యర్థాలను ల్యాండ్ ఫిల్స్ కు పంపడం అని గాకుండా వాటిని వినియోగ
వనరులుగా లేదా శక్తిగా మార్చ డం అనేది కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఎలా
దోహదం చేస్తుందో వివరించడం - తెలంగాణలో నూతన MoEFCC ఫ్రేమ్ వర్క్ పై ఆచరించేందుకు సులభంగా ఉండే
అంశాలతో కూడిన ప్రచు రణల్లో పిసిబి ఇతర సంస్థలతో కలసి సహకరించడం - ఘనవ్యర్థాల విధానాలు, ఫ్రేమ్ వర్క్, నిబంధనల విషయంలో నిపుణుల
కమిటీల ఏర్పాటుకు సహకరిం చడం, ఇన్ పుట్స్ అందించడం, సమీక్షలు, మద్దతు అందించడం
- రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అధికం చేయడంలో
తెలంగాణ ప్రభుత్వం, కోకా- కోలా బేవరేజెస్ ప్రై.లి. (హెచ్ సిసిబి) భాగస్వామ్యానికి ప్రతిపాదన దీనికి సంబంధించి, ఈ సంయుక్త కార్యక్రమం కింద:
- తెలంగాణ ప్రభుత్వం, హెచ్ సిసిబి రాబోయే రెండేళ్లలో 10,000 మందికి
పైగా యువతకు నైపుణ్యాల శి క్షణను అందించడం, విధివిధానాలపై కృషి - అదనంగా, ఎన్ఐఐటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో హెచ్ సిసిబి నిర్వహించే
నైపుణ్య అభివృద్ధి కేంద్రమైన కెరీ ర్ డెవలప్ మెంట్ సెంటర్ నుంచి ఈ
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చే అం శా
న్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది - మ్యాన్ పవర్ రిసోర్సింగ్ కంపెనీలు కెరీర్ డెవలప్ మెంట్ సెంటర్ల
నుంచి నేరుగా అభ్యర్థులను తీసుకునేం దుకు వీలుగా కరిక్యులమ్ ను మరింత
పటిష్ఠం చేసే విషయంలో హెచ్ సిసిబి, తెలంగాణ ప్రభుత్వం మ్యాన్ పవర్
రిసోర్సింగ్ కంపెనీలతో కలసి పని చేస్తాయి. కెరీర్ డెవలప్ మెంట్
సెంటర్లలో శిక్షణ పొందిన వారి ప్లేస్ మెంట్ రేటు మెరుగుపడేందుకు ఇది
వీలు కల్పిస్తుంది. - ప్రజలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత కల్పించే కార్యక్రమాలు,
కరిక్యులమ్స్ విస్తరణలో తెలంగాణ ప్రభుత్వం, హెచ్ సిసిబి కలసి పని
చేస్తాయి
- ఈ తయారీ కేంద్రం కోసం లోకల్ వెండర్స్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఎంఎస్ఎంఇ యూనిట్ల అభివృద్ధి ద్వారా, రైతు ఉత్పత్తిదారు సంస్థలతో లింకేజీల ద్వారా తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటు