Fri. Nov 8th, 2024
HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,
జనవరి 28,2021ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 1000 మంది ఉద్యోగులను తీసుకోవడానికి ప్రణాళిక చేస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

·సుప్రసిద్ధ అంతర్జాతీయ సాంకేతిక కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫిబ్రవరి 12–13,2021 తేదీలలో వర్ట్యువల్‌గా మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించబోతుంది. ఈ కంపెనీ ఇప్పుడు దాదాపుగా 1000 నూతన ఉద్యోగావకాశాలను ఫ్రెషర్స్‌/అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ క్యాంపస్‌, గన్నవరం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ వద్ద అందించనుంది.

·గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని 30 ఎకరాలలో చేశారు.

·అత్యాధునిక అంతర్జాతీయ ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహించాలనే హెచ్‌సీఎల్‌ ,సిద్ధాంతానికి అనుగుణంగా ఈ విజయవాడ కేంద్రం ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రతిభావంతులను నియామకం చేసుకోవడం, శిక్షణ అందించడం,ఉపాధి కల్పించడంతో పాటుగా వారు సంతృప్తి గా దీర్ఘకాలం విధులను నిర్వహించడానికి తగిన వాతావరణం సృష్టించింది.  ఈ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం సైతం ఉంది. విజయవాడ కేంద్రంలో అత్యున్నత సాంకేతికతలపై దృష్టి సారించారు. దీనిలో ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్,ప్రొడక్ట్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ విభాగాలున్నాయి.

HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada
HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada

·హెచ్‌సీఎల్‌ విజయవాడ  ‘కమ్‌ బ్యాక్‌ హోమ్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా దేశం నలుమూలలా ఉన్న ప్రతిభావంతులను ఇంజినీరింగ్‌ సేవలు, అప్లికేషన్,ఉత్పత్తి అభివృద్ధిలో ఉత్సాహపూరితమైన కెరీర్‌ల కోసం తిరిగి రావాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. ‘స్టే రూటెడ్‌’ ప్రోగ్రామ్‌ ద్వారా తమ సొంత నగరంలో అంతర్జాతీయ అవకాశాలను గ్రాడ్యుయేట్లు పొందేలా అవకాశాలు కల్పించడంతో పాటుగా ఫ్రెషర్లకు తాజా అవకాశాలనూ అందించనుంది.

·ప్రవేశ దశ ఉద్యోగ బాధ్యతల కోసం అత్యున్నత స్కిల్‌ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను హెచ్‌సీఎల్‌ అందిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు  శిక్షణ, నియామకాల కోసం దరఖాస్తు చేయడం ద్వారా తమ ఐటీ కెరీర్‌ను హెచ్‌సీఎల్‌తో ఆరంభించవచ్చు. హెచ్‌సీఎల్‌ ఈ శిక్షణా కార్యక్రమాలను 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో పాటుగా సైన్స్‌గ్రాడ్యుయేట్లు, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు,  పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌కు అందించనున్నారు.

·హెచ్‌సీఎల్‌ విజయవాడ కేంద్రంలో హెచ్‌సీఎల్తొ లి దశ కెరీర్‌ కార్యక్రమం –‘టెక్‌ బీ’ కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ ‘టెక్‌ బీ’ కార్యక్రమం ద్వారా 12 వ తరగతి పూర్తయిన విద్యార్థులు హెచ్‌సీఎల్‌లో ప్రవేశ దశ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం టెక్‌ బీ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థులను హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో ఉద్యోగాలలో నియమిస్తారు. టెక్‌బీ స్కాలర్స్‌ ఉన్నత విద్యకు సైతం  తమ బిట్స్‌ పిలానీ లేదా శాస్త్ర యూనివర్శిటీల ద్వారా హెచ్‌సీఎల్‌ మద్దతును అందిస్తుంది.

· ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగే మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో హెచ్‌సీఎల్‌ తాజా గ్రాడ్యుయేట్లను, 2–8 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను జావా, చిప్‌ డిజైనింగ్‌, డాట్‌ నెట్‌. అజ్యూర్‌,  మైక్రోసర్వీసెస్‌ ,ఖిఅ్క, పైతాన్‌, ప్రోటోకాల్‌ డెవలప్‌మెంట్‌, నెట్‌వర్కింగ్‌, డెవ్‌ఆప్స్‌ ,ఆటోమేషన్‌ టెస్టింగ్‌లో నిర్వహించనుంది.

HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada
HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada

ముఖ్యాంశాలు :

· వర్ట్యువల్‌ మెగా రిక్రూట్‌మెంట్‌ తేదీ : ఫిబ్రవరి 12 ,13,2021

·సమయం  : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ

· దరఖాస్తుకు చివరి తేదీ : ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 11,2021వ తేదీ వరకూ మాత్రమే సమర్పించవచ్చు

·అభ్యర్ధులు తమ దరఖాస్తులను https://www.hcltech.com/careers/vijayawada వద్ద    సమర్పించవచ్చు.

·విజయవాడ కేంద్రంలో ప్రస్తుతం 1500  మందికి పైగా ఐటీ ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు.

·రాబోయే  రెండేళ్లలో విజయవాడలో 3వేల మంది ఉద్యోగులను తీసుకోవడానికి  ప్రణాళిక చేసిన హెచ్‌సీఎల్‌

·ఈ రిక్రూట్‌మెంట్‌ క్యాంపెయిన్స్‌ చెన్నై,బెంగళూరు,  పూనె, కోల్‌కతా, హైదరాబాద్‌లలో నిర్వహించనుంది.

ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ గురించి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  కార్పోరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌   Ms శ్రీమతి శివశంకర్‌ మాట్లాడుతూ  ‘‘హెచ్‌సీఎల్‌,న్యూ విస్టాస్‌ కార్యక్రమం భారతదేశంలో ప్రతిభావంతులకు సృజనాత్మక అవకాశాలను అందించనుంది,సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన  బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలను సైతం పొందేందుకు ఓ వేదికగానూ నిలుస్తుంది. ఫిబ్రవరి 12 , 13,2021 తేదీలలో మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను హెచ్‌సీఎల్‌ విజయవాడ కేంద్రం నిర్వహిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిద్వారా ఫ్రెషర్స్‌తో పాటుగా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌ ఇప్పుడు విజయవాడలోని మా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న, మా అత్యంత ఉత్సాహ పూరితమైన హెచ్‌సీఎల్‌ విజయవాడ కేంద్రంలో ఫ్రెషర్స్‌,అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు ఉపాధి అవకాశాలు అందించనున్నాం.

HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada
HCL Technologies announces Virtual Mega Recruitment Drive in Vijayawada

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కీలక విలువలైనటువంటి ధైర్యం,సంరక్షణ  ఉద్యోగులకు స్ధిరమైన  భవిష్యత్‌ దిశగా ఆశావాద స్ఫూర్తితో విధులను నిర్వహించడానికి సహకరిస్తాయి. గత నాలుగేళ్లలో,మధురై,లక్నో,నాగ్‌పూర్‌ ,విజయవాడలలోని మా న్యూ విస్టాస్‌ ప్రాంతాల ద్వారా 15వేల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ అందించడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో అంతర్భాగమయ్యారు. విజయవాడలోని గ్లోబల్‌ ఐటీ, శిక్షణా కేంద్రం యువ గ్రాడ్యుయేట్లకు తమకు తాము నైపుణ్యం సంతరించుకునే అవకాశం అందించడంతో పాటుగా ఫార్చ్యూన్‌ 500 ఖాతాదారులతో తమ అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించే అవకాశమూ అందిస్తుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌తో ఈ రూపాంతర ప్రయాణంలో భాగం కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

error: Content is protected !!