365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మదనపల్లె,జనవరి11,2023: భారత దేశంలోని ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మదనపల్లె నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తన విస్తరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే మదనపల్లెలో హెచ్‌డీఎఫ్‌సీ నూతన బ్రాంచ్ ను ఏర్పాటుచేశారు. ఈ బ్రాంచ్ తో ఆంధ్రప్రదేశ్లో హెచ్‌డీఎఫ్‌సీకి సంఖ్య 22కు చేరింది.
మదనపల్లె లోని పరిసర ప్రాంతాలలోని వినియోగదార్లు తమ సొంతింటి కలలను నిజం చేసుకునేందుకు గృహ రుణాలు పొందడానికి ఈ నూతన కార్యాలయం సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ కొత్త కార్యాలయం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.15 వరకు తెరిచి ఉంటుంది. శనివారం ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రతి నెలా మూడో శనివారం కార్యాలయానికి సెలవు.
తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హెచ్‌డీఎఫ్‌సీ రీజినల్ బిజినెస్ హెడ్ రాజన్ టాండన్ తోపాటు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో మదనపల్లెనూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లె ముఖ్యమైన సిటీ..ఈ సిటీలో గణనీయమైన ఆర్ధిక కార్యకలాపాలు పెరగడంతో ఈ నగరంతోపాటు చుట్టుపక్కల గృహాలకు చాలా డిమాండ్ ఏర్పడింది. కాబట్టి ఇది వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంద హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ అన్నారు.
ఈ కరోనా గడ్డుకాలం ప్రతివారికి స్వంత ఇంటి అవశ్యకతను తెలియచేసింది. గృహరుణాలు అనేవి మొదటిసారి కొనుగోలు చేసేవారికి, తమ స్థాయిని పెంచే విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేసేవారికి వర్తిస్తుందని రేణు సుద్ కర్నాడ్ తెలిపారు.
హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఎప్పుడూ సొంత ఇళ్లు ఉండాలనే విధానాన్ని ప్రోత్స హిస్తుంది. ఇళ్లు కొనాలనుకునేవారికి వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ కూడా అవసరమన్న విషయాన్ని గుర్తించింది. మా కొత్త కార్యాలయం హెచ్‌డీఎఫ్‌సీ నెట్వర్క్ లో ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని ప్రముఖంగా చూపిస్తుంది.
నిజంగా ఇళ్లు కొనాలనుకునేవారికి సంబంధించి ఇంతవరకు ఎవరూ అందుకోని మార్కెట్‌ను చేరుకోవాలన్నది మా లక్ష్యంఅని, ఇల్లు కొనాలని నిర్ణయించుకునేవారికి సాయం చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ అన్నారు.
కస్టమర్ హోమ్ లోన్ ఖాతాను సౌకర్యవంతంగా నిర్వహించడంలో సహాయపడటానికి హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ గా సేవలను ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు, రిటైల్ డిపాజిట్ల కోసం ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దృష్టి సారించింది.
అన్ని కస్టమర్ అభ్యర్థనల కోసం ‘ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కనెక్ట్’ ని ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి కంటే ముందు 20శాతం కంటే తక్కువగా ఉన్న కొత్త రుణ దరఖాస్తుల్లో నేడు 92శాతం పైగా డిజిటల్ మార్గాల ద్వారా అందాయి.
హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో, లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ లోన్ ప్రాసెసింగ్ పై దృష్టి సారించిన మొదటి సంస్థ HDFC. హౌసింగ్ కోసం అంతర్గత డిమాండ్ ఊహించిన దాని కంటే వేగంగా సాధారణ స్థితికి రావడానికి సహాయపడింది. FY22 లో రూ. 2 లక్షల కోట్లకు పైగా రిటైల్ హోమ్ లోన్లను ఆమోదించే మైలురాయిని సాధించడంలో కీలకపాత్ర పోషించింది.
సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన సంవత్సరానికి, వాల్యూమ్ పరంగా 23శాతం గృహ రుణాలు, విలువ పరంగా 10శాతం ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) తక్కువ ఆదాయ సమూహాల (LIG) నుంచి వినియోగదారులకు అందించబడ్డాయి.
HDFC సింగిల్-విండో కాన్సెప్ట్ను అనుసరిస్తుంది. వివిధ రకాల వ్యక్తిగత అవసరాలు, చట్టపరమైన, సాంకేతిక మార్గదర్శకత్వం కోసం ఉచిత ప్రాపర్టీ కౌన్సెలింగ్ సేవలను అందిస్తుంది. రుణాలను వేగంగా ఆమోదించే సామర్థ్యాలను కలిగి ఉంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ పై అవగాహన, అనుభవంతో HDFC కూడా ప్రాపర్టీ సంబంధిత సమస్యలపై కస్టమర్లకు సలహా ఇస్తుంది. మనలో చాలా మందికి ఇల్లు కొనడం అతిపెద్ద పెట్టుబడి, జీవితకాల నిర్ణయంలో ఒక్కసారి మాత్రమే అయినందున ఇది కేవలం ఫైనాన్స్ మాత్రమే కాకుండా కస్టమర్ల గృహ అవసరాలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తుంది.
వినియోగదారుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తున్న పథకాలు..
• గృహరుణాలు
• ఇంటి మెరుగుకు రుణాలు
• ఇంటి విస్తరణకు రుణాలు
• స్థలాల కొనుగోలుకు రుణాలు
• గ్రామీణ గృహరుణాలు
• హెచ్‌డీఎఫ్‌సీ రీచ్
• ఎన్నారైలకు రుణాలు
• ఆస్తిపై తనఖా రుణాలు
• ప్రస్తుత వినియోగదారులకు టాపప్ రుణాలు
• తేలికైన రుణ చెల్లింపు సదుపాయాలు