Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జూన్ 19,2024:తమ సంస్థను, అధికారులను అనుకరిస్తూ మభ్యపెట్టే (ఇంపర్సనేషన్) నకిలీ వాట్సాప్ గ్రూప్‌లు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లిమిటెడ్ సూచిస్తోంది.

ఇలాంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలని సంస్థ పేర్కొంది. అలాగే ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ స్టాక్ మార్కెట్లో సూచనాత్మకంగా, కచ్చితమైన రాబడులు ఇప్పిస్తామంటూ ఆఫర్ చేసే స్కీములు లేదా ప్రోడక్టులను సబ్‌స్క్రయిబ్ చేయొద్దని, ఇలాంటివన్నీ చట్టవిరుద్ధమని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అనుబంధ కంపెనీగాను, దిగ్గజ బ్రోకింగ్ కంపెనీగాను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇలాంటి గ్రూప్‌లు అధిక రాబడులు అందిస్తామనే ఆశ చూపి, కీలక సమాచారాన్ని షేర్ చేసుకునేలా, నిధులను బదిలీ చేసేలా కస్టమర్లను మోసగించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తాము ఎన్నడూ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి ట్రేడింగ్ క్రెడెన్షియల్స్ కోసం అడగమని కస్టమర్లకు తెలియజేస్తోంది.

“ఇన్వెస్టర్లు మోసపూరిత లావాదేవీల బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. పూర్తి అధ్యయనం చేసి, విశ్వసనీయ సమాచారం ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నుంచి వచ్చినట్లుగా కనిపించే కమ్యూనికేషన్‌ ప్రామాణికతను ఎల్లప్పుడు ధృవీకరించుకోవాలి. మా అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే లావాదేవీలు జరిపేలా జాగ్రత్తలు తీసుకోవాలి” అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీడీవో & సీవోవో సందీప్ భరద్వాజ్ తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎన్నడూ ఆధార్ లేదా పాన్ కార్డ్ వివరాల్లాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని వాట్సాప్ లేదా ఇతరత్రా ఏ అనధికారిక మాధ్యమాల ద్వారా గానీ కోరదు. అంతేగాకుండా వాట్సాప్‌ గ్రూప్‌లలో కస్టమర్లను జోడించదు. అలాగే, అధికారిక ప్లాట్‌ఫాంలు కాకుండా మరి దేనికీ నిధులను బదలాయించాలని కోరదు.

సురక్షితంగా ఉండేందుకు, అధికారిక హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వెబ్‌సైట్ లేదా ధృవీకరించబడిన యాప్ స్టోర్స్  వంటి విశ్వసనీయ సోర్స్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తరఫున పనిచేస్తున్నామంటూ ఏ గ్రూప్స్ అయినా చెప్పినా లేక ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినా కస్టమర్లు తక్షణమే నిర్దేశిత కస్టమర్ సర్వీస్ టీమ్‌కు ఆ విషయాలను రిపోర్ట్ చేయాలి.

తదుపరి మరింత సహాయం అవసరమైనా లేదా ఏదైనా స్కామ్‌పై ఫిర్యాదు చేయాలన్నా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కస్టమర్ సర్వీస్ నంబరు 022-39019400 ను సంప్రదించగలరు.

Also read : HDFC Securities Caution customers against Fraudulent WhatsApp Groups and Impersonation Scams

ఇది కూడా చదవండి :కారు దొంగతనం తర్వాత బీమా క్లెయిమ్ ఎలా పొందాలో తెలుసా..

Also read : PhonePe Payment Gateway Launches Referral Program..

ఇది కూడా చదవండి :కూరగాయల ధరలు : సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం..

error: Content is protected !!