homeminister-Mahamood-ali

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,మునుగోడు,అక్టోబర్ 27,2022: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం హోంశాఖ మంత్రి చౌటుప్పల్ చండూరు మండలాలలోని వివిధ గ్రామాలలో పర్యటించారు.

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విశ్వాసం లేదన్నారు.

చౌటుప్పల్‌ మండలంలోని లక్కారం, చండూరు మండలంలోని అంగడిపేట గ్రామాలలో సమావేశాలు నిర్వహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే హోంమంత్రి మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్ పార్టీ పనితీరును ప్రజలకు తెలియజేసేందుకు ముస్లింల ఇళ్లకు వెళుతున్నారు. ప్రచారం సందర్భంగా ముస్లింలతో పాటు, దళిత కుటుంబాల తోనూ సమావేశ మవుతున్నారు.

మంత్రి తన పర్యటనలో ఇమామ్‌లు, ముస్లీంలు, ముస్లిం సంఘాలు, మహిళలతో విడివిడిగా సమావేశమై ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ముస్లింలకు అందజేస్తున్న పథకాలు, సౌకర్యాల గురించి సవివరంగా తెలియజేస్తున్నారు. ప్రజలతో హోం మంత్రి మాట్లాడుతూ…

homeminister-Mahamood-ali

ముఖ్యమంత్రి కే సి ఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో విద్య, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజలకు అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించిందన్నారు.

మునుగోడు నియోజకవర్గాన్ని పట్టిపీడించిన ఫ్లోరైడ్‌ నీటికి బదులుగా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి పారుదల, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌ వంటి పతాకాలపై వివరించారు. ముస్లిం సోదరులకు షాది ముబారక్, ఉపకార వేతనాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఆసరా పెన్షన్లను అందజేస్తూ మైనారిటీల అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

ముఖ్యమంత్రి కే సి ఆర్ సార‌ధ్యంలో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వ‌త్రా అభివృద్ది చేయ‌డానికి టిఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం మైనారిటీ సంక్షేమం కింద 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను కేసీఆర్ మంజూరు చేశారని, కోట్లాది రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలియజేశారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటుతో ముస్లింలకు విద్యారంగంలో విప్లవం సృష్టించినట్లు అయిందన్నారు.

homeminister-Mahamood-ali

అంతిమంగా మణుగూడ గత ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఏకపక్షంగా గెలిపించాలని, బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా సమాధానం చెప్పాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు. లక్కారంలో ఇంటింటి ప్రచార నిర్వహించిన హోంమంత్రి చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో బుధవారం నాడు హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.