365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి14,2023: గుండె జబ్బులతో బాధపడే యువకులు, స్టెంట్స్ వేయించు కోవడం, లేదా బైపాస్ సర్జరీలు చేయించుకున్నప్పటికీ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇతర వ్యక్తులపై కేకలు వేయడంవల్ల కోపం, చికాకు, ప్రతికూల భావాలు, భావోద్వేగాలు గుండెపోటు ప్రమాదాన్నిపెంచుతాయని కార్డియాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
అయితే కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవడం ద్వారా కొంతమేర గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది సంగీతం వింటూ ఉంటారు. మరోకొంతమంది పాటలు పాడుతారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్ట్రెస్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు.
కానీ వీటన్నిటికంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
తక్షణ ఒత్తిడి అయినా, దీర్ఘకాల ఒత్తిడి అయినా.. రెండింటి నుంచీ బయట పడటానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఆందోళన సైతం తగ్గుతుంది.
కాబట్టి రోజూ కాసేపు మనసును కుదురుగా నిలిపే మెడిటేషన్ చేయటం మంచిది. ప్రశాంతంగా, స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస నిలిపినా చాలు. మనసు తేలికపడుతుంది. ఇలా చేస్తే గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు.