Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,జనవరి 27,2021:అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ లో వీక్షించి మీరు వైభవమైన ‘ఎమ్ఇ’ టైమ్ అనుభవం పొందటానికి అయిదు అద్భుతమైన /అత్యుత్తమ దక్షిణ భారతదేశ సినిమాలు ఇక్కడ ఉన్నాయి ఒక సినిమా చూసి మీకు చాలా ఇష్టమైన ఏకాంత సమయం గడపాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఇక వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింగిల్ యూజర్ వీక్షణాన్ని మరింత వినోదంగా మార్చే ఒక కొత్త మొబైల్ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్ టెల్ సహకారంతో ఇండియా లో
ఎక్సుక్లూజివ్ గా రూ 89 ప్రారంభ ధరతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (PVME) లాంచ్ చేసింది. PVME అనే
సింగిల్-యూజర్ మొబైల్-ఓన్లీ ప్లాన్ (అంటే అర్థం మీ OTT సబ్ స్క్రిప్షన్ ను మీ స్నేహితులు,కుటుంబంతో
ఎంతమాత్రం మీరు షేర్ చేయకూడదు), ఎయిర్ టెల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియోను SD క్వాలిటీలో, 1నెల ట్రైల్ పీరియడ్ తో సహా, స్ట్రీమ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. మీ సబ్ స్క్రిప్షన్ పూర్తి కాగానే మీరు అత్యుత్తమలోకల్ ఇండియా సినిమాలు చూడాలనుకునే మూడ్ లో ఉంటే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రింద తెలిపిన బ్లాక్ బస్టర్,వీడియోల లిస్టు దొరుకుతుంది.

Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time
Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time

సూరరై పోట్రు

సూరరై పోట్రు అనే చిత్రం మీకు తప్పకుండా నింగిని తాకే అనుభూతి కలిగిస్తుంది, ఎందుకంటే ఈ చిత్రం డెక్కన్ ఫౌండర్,జిఆర్ గోపీనాథ్ జీవితంలోని కొన్ని యథార్థ సంఘటనల ప్రేరణతో రూపొందింది. సుధా కొంగర దర్శకత్వంలోని ఈ చిత్రం,దీని ఉత్తమ కథకి పరిపూర్ణమైన మిశ్రమంగా ఉన్న సూపర్ స్టార్ సూర్య నటనతో అద్భుతం. కాబట్టి ఈ చిత్రం ఒక గొప్ప ప్రేరణాత్మక ఉత్తమ స్టార్ చిత్రమని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ చిత్రం మిమ్మల్ని మీ లక్ష్యసిద్ధి ,
స్వప్నసాధన వైపు మీకు ప్రేరణ అందించి, మీరు ఆశించే ఉన్నత శిఖరాలు చేరేందుకు మీరు పనిచేసేలా మీకు ప్రేరణ అందించగలదు. ఇది మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని ఆకట్టుకునే ఒక ఫీల్ గుడ్ సినిమా, ఇది సూర్య,అపర్ణ బాల మరళి తో మీరు హాయిగా విహరించే ఉత్తమ విహార సమయం చిత్రం.

మిడిల్ క్లాస్ మెలొడీస్

మంచి రుచులు, వినోదం కావాలని అనుకుంటే మీరు ఈ సినిమా తప్పక చూడాలి. మిడిల్ క్లాస్ మెలొడీస్ ఒక రెస్టారెంట్ యాజమాన్యం కలిగిన తండ్రి-కొడుకు ఇద్దరి జీవితాల మధ్య తిరిగే ఒక హాస్యరస డ్రామా చిత్రం. హాస్య ప్రధాన పద్ధతిలో చూపించబడిన వారి రోజువారీ ఇబ్బందులు, దెబ్బలాటలు, జీవితం అనే చక్కని వటకంలోని తీపి,చేదు రుచులన మనకు అందిస్తుంది. కాబట్టి, మీరూ ఒక ప్లేటు తీసుకుని, సిద్ధంగా ఉండండి, ఆనంద్ దేవరకొండ విశిష్టంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు ఫేమస్ బాంబే చట్నీ సర్వ్ చేయటానికి రెడీగా ఉన్నారు.

Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time
Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time

నిశ్శబ్దం/ సైలెన్స్

మన కళ్లకు ఒక గొప్ప విందు అందజేసే ఒక థ్రిల్లర్ మూవీలో మన దేనసేన (అనుష్కా శేట్టి) ముగ్గరిలో ఒక ఇడియట్(ఆర్ మాధవన్) తో మళ్లీ వచ్చేసింది. ఇది ఒక్కొక్క సంభాషణతో మిమ్మల్ని సీటు చివర కూర్చోబెట్టి ఉర్రూతలూగించే ఒక చక్కని సినిమా. ఈ చిత్రంలో డ్రామా, సస్పెన్స్ ,ఎమోషన్స్ , పరిపూర్ణమైన మిశ్రమం. కాబట్టి మీరు ఒక మిస్టరీ మూవీ చూడాలని అనుకుంటే, మరొక దానికోసం వెదక వద్దు, ఎందుకంటే, ఈ మూవీ మీకు ఆశ్చర్యంతో మూగబోయేలా చేసే ఒక అద్భుతమైన చిత్రం.

మార

ఈ చిత్రం మనల్ని ఒక స్వప్న లోకం లోకి తీసుకుపోతుంది, ఇది హృద్యమైన లొకేషన్లు ,దృశ్య ప్రధాన ల్యాండ్,స్కేప్స్ తో నిండిన ఆహ్లాదకరమైన చిత్రం. ఆర్. మాధవన్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం మిమ్మల్నిఇండియా లోని నిజమై స్వప్న జగత్తు దృశ్యాల ప్రాంతాలకు తీసుకు వెళ్తుంది. అందమైన పచ్చపచ్చని భూములు, నీలి
నింగి, మనసుని దోచే ప్రకృతి సోయగాలు చూస్తే, మీరు బ్యాగ్ సర్దుకుని, గ్రామసౌందర్యాలని ఆస్వాదించేందుకు వెళ్లాలని మీకు అనిపిస్తుంది. మార అనే ఈ చిత్రం ఆర్టిస్ట్ , అతని ఆర్ట్ కు సంబంధించిన చిత్రం. రంగు రంగుల
పెయింటింగ్స్, గోడచిత్రాలు, క్రియేటివ్ మడ్ ఐడల్స్ ఇవి అన్నీ మీ కళ్లక అనందం అందజేసేవి, ఈ చిత్రం
క్రియేటివ్,విజువల్ దృశ్య వీక్షణంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఇంకా, కళ ద్వారా వర్ణించబడిన ఈ కథ ద్వారా,మార చిత్రం నేను ఇంత ఆల్సస్యంగా చూసానెందుకుని తప్పక అనుకుంటారు.

Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time
Here’s five fantastic/fabulous South Indian films that you can watch on the Mobile Edition of Amazon Prime Video making for a splendid ‘ME’ time

సియు సూన్ (CU Soon)

లాక్ డౌన్ లో షూట్ చేసే లిమిటెడ్ ఆప్షన్స్ తో. CU Soon అనే చిత్రం తయారు చేయబడింది ఒక సినిమా చేయటం ఎలా అనే విశిష్ట టెక్నిక్స్ గురించి (డైరెక్టర్, ఎడిటర్ కావాలనుకునే వారికి – మీ అందరికి ఈ చిత్రం ఒక ప్రేరణ). ఒకమూవీ తయారీకి కావలసిన అన్ని చేక్ బాక్సులను (విషయాలను) ఈ మూవీ చెక్ చేసింది, ఇదొక చక్కని చిత్రం.ఫహాద్ ఫాసిల్ ఆన్-పాయింట్ యాక్టింగ్ కానీ. లేదా విశిష్టమైన ఆకట్టుకునే స్టోరీ లైన్ అయినా, ఈ మూవీ పాండమిక్,సమయంలో మన జీవితాలలోకి వచ్చింది. మీరు ఇంటిలో కదలకుండా ఇరుక్కుపోయిన స్థితిలో కూడా ఒక చిత్రం తయారు చేయటానికి మీకు ఒక స్టోరీ,విజన్ అవసరం కావాలి.