365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: కొత్తగా మా ప్రయాణం చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సినిమా సూర్యాపేట్‌ జంక్షన్‌. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు.

ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్య‌క్ర‌మం ఇటీవల హైదరాబాదులోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

ఈ సంద‌ర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు కథ నేనే రాశాను. ఇది సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ. గవర్నమెంట్ నుంచి ఉచితాలు పొందడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించే సబ్జెక్టు.

మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, హిట్టు చేస్తారని ఇది ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమాను చేశాం. యాక్షన్ సీన్స్ సహజంగా ఉంటాయి. సినిమాలో 4 పాటలు ఉన్నాయి. డైరెక్టర్ రాజేష్ గారు కథను చాలా బాగా తెరకెక్కించారు. మీరు అందరూ ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

హీరోయిన్ నైనా సర్వర్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను జ్యోతి పాత్రలో నటించాను. ఈ కథ యూత్‌కు చాలా నచ్చుతుంది. ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ, “ఈశ్వర్ గారు నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఆయన కథకు పూర్తి న్యాయం చేశారు. నైనా సర్వర్ తెలుగు సినిమాకు కొత్త అయినప్పటికీ ఈ చిత్రంలో చాలా బాగా నటించారు.

గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ పాత్రను మెరుగు ప‌ర్చాడు. చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్ సంజయ్ (బలగం ఫేమ్), హరీష్ తదితరులు చాలా అద్భుతంగా నటించారు. రోషన్ సాలూరి, గౌర హరి అందించిన మ్యూజిక్ అద్భుతం. ఈ చిత్రంలో మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తాయి.

ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయాలనుకుంటున్నాం” అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్: సూర్యాపేట్‌ జంక్షన్
నిర్మాతలు: అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు
డైరెక్టర్: రాజేష్ నాదెండ్ల
స్టోరీ: ఈశ్వర్
మ్యూజిక్: రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి: అరుణ్ ప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్: శ్రీనివాస్ కోరా
లిరిక్స్: ఎ. రహమాన్
పోస్టర్ డిజైనర్: ధనియేలె
రైటర్స్: సత్య, రాజేంద్ర భరద్వాజ్
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: ఎ. పాండు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్