365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 29,2025: రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు హీరో కృష్ణసాయి. సినీ ఫోటో జర్నలిస్ట్ ఆర్కే చౌదరికి ఆర్థిక సహాయాన్ని అందజేసి తన మానవత్వాన్ని ప్రదర్శించారు. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించిన కృష్ణసాయి, ఆయన చికిత్స కోసం రూ.15,000 చెక్కును అందించారు.
Read this also…Actor Krishna Sai Extends Financial Support to Cine Photojournalist RK Choudhary
ఇది కూడా చదవండి..MG అస్టర్: భారతదేశపు మొట్టమొదటి AI SUV ఇప్పుడు ‘బ్లాక్‌బస్టర్ SUV’!
ఓ ప్రెస్ మీట్లో విధినిర్వహణలో ఉన్న ఆర్కే చౌదరి ప్రమాదవశత్తు కాలు జారి పడడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. వైద్య పరీక్షల్లో వెన్నుముక డిస్క్‌లు కంప్రెస్ కావడంతో శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా, నిరంతరం ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక భారం కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి, తక్షణ సాయంగా రూ.15,000 అందించారు.

ఈ సందర్భంగా కృష్ణసాయి మాట్లాడుతూ, “ఆర్కే చౌదరి సినీ ఫోటో జర్నలిజానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన కుటుంబ పరిస్థితిని గమనించి, సినీ పరిశ్రమకు చెందిన ప్రతిఒక్కరూ తమ వంతు సహాయం అందించాలి” అని కోరారు.
Read this also…MG Astor MY2025: ‘The Blockbuster SUV’ with Advanced Tech and Safety
Read this also…“Powerful Earthquake Strikes Myanmar: 150 Dead, India Rushes Aid”
కృష్ణసాయి తన సహాయహస్తం చాపినందుకు ఆర్కే చౌదరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు సినీ జర్నలిస్టులు కూడా కృష్ణసాయిని అభినందించారు. ‘సుందరాంగుడు’, ‘జ్యువెల్ థీఫ్’ చిత్రాల్లో హీరోగా నటించిన కృష్ణసాయి, ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నిరుపేదలకు, అవసరమైన వారికి సహాయాన్ని అందిస్తున్నారు.