365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,23 ఆగస్ట్ 2024 : హీరో రవితేజ తన తాజా చిత్రం ఆర్టీ75 షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఆయన కుడిచేతికి తీవ్ర గాయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రవితేజ షూటింగ్ సమయంలో కుడిచేతి గాయం అయ్యింది. ఈ గాయం తీవ్రంగా ఉండటంతో ఆయన కొన్నిరోజులపాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సలహా ఇచ్చారు.
గాయం కారణంగా, రవితేజ యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. గాయం ఎక్కువగా అవ్వడంతో వైద్యులు చికిత్స అవసరం అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రవితేజకు కుడిచేతి గాయం పూర్తిగా రికవర్ అవ్వాలంటే ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ గాయం కారణంగా, ఆర్టీ75 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌కు తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది.
ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పూర్తి విశ్రాంతి తీసుకోవడం ద్వారా రవితేజ త్వరగా కోలుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.