365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7,2025: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)‌ను 2025 ఫిబ్రవరి 12న (బుధవారం) ప్రారంభించనుంది.

ఈ ఇష్యూ ఫిబ్రవరి 14 (శుక్రవారం) నాటికి ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ తేదీ ఫిబ్రవరి 11 (మంగళవారం)గా నిర్ణయించారు.

ఇపీవో ధర శ్రేణిని ఒక్కో షేర్‌కు ₹674 నుంచి ₹708 మధ్యగా నిర్ధారించారు. కనీసంగా 21 ఈక్విటీ షేర్లు, ఆపై 21 షేర్ల గుణితాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ సీఏ మ్యాగ్నం హోల్డింగ్స్ ₹8,750 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది.

హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్లు ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE),నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో లిస్టింగ్ కానున్నాయి.

ఈ ఇష్యూకి కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్) వంటి సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.