Mon. May 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,లండన్,మే 9,2023: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బ్రిటన్ లోని తెలంగాణ వాసుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉన్నత విద్యలో నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదురుకొంటున్న సవాళ్ళను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య విషయంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలను సుదీర్ఘంగా వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం1988 APSCHE ఉన్నత విద్యా మండలి స్వీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSCHE తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఏర్పాటు చేయడం జరిగింది అని అంతేకాకుండా TSCHE. ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడం కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉన్నతవిద్యపై పెరుగుతున్న ఆదరణను దృష్టికి లో ఉంచుకొని అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ,వృత్తిపరమైన సంస్థలు స్థాపించినట్లు ఆయన తెలిపారు.

డిగ్రీ కాలేజీల్లో డేటా సైన్సెస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బిజినెస్ అనలిటిక్స్‌లో బీకామ్ లాంటి కొత్త కోర్సులను ప్రారంభించి గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పనా లో దోహద పడుతుంది అని అన్నారు. విద్యార్థుల ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.

ఈ కార్యక్రమాలు విద్యార్థులో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించడం వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన రిటైల్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ఇ-కామర్స్‌కు సంబంధించిన కోర్సులను రూపకల్పన చేస్తూన్నామని, అంతే కాకుండా విద్యార్థులకు చదువుతున్న సమయం లోనే స్టైఫెండ్ అందేలా రూపకల్పన చేస్తున్నాముని తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయ పథకాలనుఅందిస్తుంది. ఈ కార్యక్రమాలు అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

విద్యా ప్రమాణాలను నిర్వహించడం ఎప్పటికప్పుడు మెరుగు పరచడానికి అక్రిడిటేషన్, మూల్యాంకన పద్ధతులుఉపయోగం లో ఉన్నవి అని తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇటీవలి పరిశీలన ప్రకారం, తెలంగాణలోని ఆరు రాష్ట్ర విశ్వవిద్యాల యాలలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదు అయింది.

రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్,మెడిసిన్ మినహా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేరిన మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే 14,000 పైగాఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న స్కాలర్‌షిప్‌ల, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాల కారణాలవల్ల ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య పెరగడానికి కారణమని తెలియజేసారు. ఉన్నత విద్యలో ఏడేళ్ల క్రితం ప్రబలంగా ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించ గలిగామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉన్నటు విద్యవ్యవస్థను, కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర సూచనలను పరిగణి లోకి తీసుకోకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ని తీసుకరకడం వాళ్ళ కొత్త విద్య విధానం పై పలుసందర్భాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని ఒక ప్రశ్నకు బదులు తెలిపారు.

తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం కరుణ ఐఏఎస్ గారు , మన ఊరు మన బడి కార్యక్రమం నడుస్తున్న తీరును, ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు అభివ్రిద్ది ని వివరించారు. ముఖ్యమంత్రి నిర్దిష్ట ప్రణళిక , లోతైనపరిజ్ఞానం వాళ్ళ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 27,000 పాఠశాలలో తొలిదశలో 7000 పాటశాలలను అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలుఏర్పరుస్తూ తీర్చి దిద్దుతున్న తీరును స్పష్టం చేసారు.

హైదరాబాద్ బావార్చి రెస్టారెంట్ ఆధిత్యాన్ని స్వీకరించినందుకు ప్రవాసులు బావార్చి రెస్టురెంట్ యజమానులు కిశోరె మున్నాగాల , తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షులు దన్నంనేని సంపత్ కృష్ణ , ఉస్మానియా అలుమ్ని యూకే యూరప్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ , తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రవణ్ గౌడ్ , పింగళి శ్రీనివాస్ రెడ్డి , ప్రముఖ న్యాయవాది కమల్ ఓరుగంటి, సురేష్ గోపతి తదితరులు ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి, కరుణలను ఘనంగా సత్కారించారు.