365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఫిబ్రవరి 6, 2024: స్టీల్ ఫోర్జింగ్ పరిశ్రమలో ప్రముఖ తయారీదారు, పంపిణీదారు అయిన హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్, ఫ్లాంజులు, ఫిటింగ్స్, ఆయిల్ ఫీల్డ్, మెరైన్ ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగి ఉంది.
రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్‌కు సంబంధించిన పెద్ద వ్యాపారాన్ని ఈ సంస్థ ఆశిస్తోంది. ఈ కంపెనీ సంవత్సరానికి 48,000 చక్రాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
రీప్లేస్ మెంట్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ ను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్ మార్గం ద్వారా సమీప భవిష్యత్తులో పెద్ద రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్ ఆర్డర్లను కంపెనీ ఆశిస్తోంది.
కంపెనీ 2022 ప్రారంభంలో సాంకేతికంగా ప్రత్యేకమైన ఉత్పత్తి అయిన రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది.
గత 18 నెలల్లో కంపెనీ 2000 కంటే ఎక్కువ రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్స్, రైల్ గేర్ బ్లాంక్ లను సరఫరా చేసింది. కంపెనీ భారతదేశంలోని వివిధ భారతీయ రైల్వే వర్క్ షాప్ లలో రీప్లేస్ మెంట్ మార్కెట్ కోసం రైల్వే ఫోర్జ్డ్ వ్యాగన్ వీల్ ను సరఫరా చేస్తుంది.
2005లో స్థాపించిన హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థ… స్టీల్ ఫోర్జింగ్ పరిశ్రమలో ప్రముఖ తయారీదారుగా, పంపిణీదారుగా నిలిచింది. ఫ్లాంజ్ లు, ఫిటింగ్స్, ఆయిల్ ఫీల్డ్, సముద్ర ఉత్పత్తుల్లాంటి వాటిలో ప్రత్యేకత కలిగి ఉంది.
టర్బైన్ బ్లేడ్లను తయారు చేయడం ద్వారా కంపెనీ తన పోర్ట్ ఫోలియోను విజయవంతంగా విస్తరించింది. ఫోర్జ్డ్ వీల్స్ ఉత్పత్తితో రైల్వే పరిశ్రమలోకి ప్రవేశించింది.
మహారాష్ట్రలోని వాడాలో 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న తయారీ కేంద్రంలో ఫోర్జింగ్, మెషినింగ్, హీట్ ట్రీట్ మెంట్, ల్యాబ్ టెస్టింగ్ లాంటి పనులన్నింటినీ ఒకేచోట కంపెనీ పూర్తి చేస్తోంది.