Sat. Nov 23rd, 2024
Hinduja Foundation collaborates with The Chopra Foundation to promote the importance of Mental Health during the Covid-19 pandemic

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,మే 15, 2021 ః శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన హిందుజా గ్రూప్‌ దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్‌ ఇప్పుడు మానసిక ఆరోగ్యం ,సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్‌ ఇప్పుడు చోప్రా ఫౌండేషన్‌, జాన్‌ డబ్ల్యు బ్రిక్‌ మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌,సీజీ క్రియేటివ్స్‌ల భాగస్వామ్యంతో  నెవర్‌ ఎలోన్‌ గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్‌ (వర్ట్యువల్‌) సదస్సులో భాగమైన  స్పాట్‌లైట్‌ ఇండియాకు మద్దతునందిస్తుంది. మూడు గంటల పాటు జరిగే ఈ స్పాట్‌లైట్‌ ఇండియా విభాగంలో సద్గురు.అభయ్‌ డియోల్‌ వంటి సుప్రసిద్ధ వ్యక్తులు ప్రసంగించనున్నారు.ఈ వర్ట్యువల్‌ సదస్సు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ మరియు ఇతర మాధ్యమాలపై  21 మే 2021వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.ఈ సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం కోసం తోడ్పడే ఉచిత ఆన్‌లైన్‌ ఉపకరణాలను https://neveralonesummit.live/ ద్వారా వినియోగించుకోవచ్చు.హిందుజా గ్రూప్‌ కో ఛైర్మన్‌,హిందుజా ఫౌండేషన్‌ ట్రస్టీ గోపిచంద్‌ పీ హిందుజా మాట్లాడుతూ ‘‘మానసిక ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా ఉంటాయి. గుర్తించనటువంటి మహమ్మారిగా దీనిని వెల్లడించవచ్చు. తప్పుడు నమ్మకాల కారణంగా పరిస్థితి నివారించలేని స్థితికి చేరుతుంది. దీనికి వైద్య జోక్యమూ అవసరమవుతుంది. అయితే అది కూడా సవాల్‌గానే పరిణమిస్తుంటుంది. నా దృష్టిలో బాధిత వ్యక్తికి పలు రీతులలో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ సదస్సు ఆ తరహా అవకాశాలను వెల్లడిస్తుంది’’ అని అన్నారు.

Hinduja Foundation collaborates with The Chopra Foundation to promote the importance of Mental Health during the Covid-19 pandemic
Hinduja Foundation collaborates with The Chopra Foundation to promote the importance of Mental Health during the Covid-19 pandemic Hinduja Foundation collaborates with The Chopra Foundation to promote the importance of Mental Health during the Covid-19 pandemic

హిందుజా ఫౌండేషన్‌ అధ్యక్షులు పౌల్‌ అబ్రహమ్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో శారీరక ఆరోగ్యంపై దృష్టిసారించిన విధంగా మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించలేము. నెవర్‌ ఎలోన్‌ సమ్మిట్‌ 2021లో భాగంగా స్పాట్‌లైట్‌ ఇండియాను నిర్వహించడంలో భాగంగా అల్కెమిక్‌ సోనిక్‌ ఎన్విరాన్‌మెంట్‌, చోప్రా ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నటికీ ఒంటరిలు కాదనే సందేశం వ్యాప్తి చేయగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.అల్కెమిక్‌ సోనిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫౌండర్‌, ఫ్లూటిస్ట్‌, సౌండ్‌ ఆర్టిస్ట్‌ సత్య హిందుజా మాట్లాడుతూ మనసు –శరీర ఔషదం పట్ల అవగాహన పెంచడంతో పాటుగా మానసిక శ్రేయస్సు భవిష్యత్‌ కోసం నూతన స్థిరమైన వ్యవస్థలను నిర్మించడానికి కళలు, సంభాషణను మిళితం చేస్తూ నిర్వహిస్తోన్న స్పాట్‌లైట్‌ ఇండియా లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.చోప్రా ఫౌండేషన్‌ ఫౌండర్‌, ఎండీ శ్రీ దీపక్‌ చోప్రా మాట్లాడుతూ ‘‘మానసిక అనారోగ్యం కారణంగా  ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం సమిష్టిగా సహాయం చేయకపోతే, మనం మానవత్వ పరంగా అపూర్వమైన సంక్షోభంలోకి వెళ్లనున్నాం’’ అని అన్నారు.

error: Content is protected !!