365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి,16, 2022:రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఈ నెల 30 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు కొన‌సాగుతాయ‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు cs ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. ఆయా పాఠ‌శాల యాజ‌మాన్యాల నిర్ణ‌యం మేర‌కు ఆన్లైన్ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని తెలిపింది.

రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి, ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ గా ఉన్నది. ఈ నేపథ్యం లోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్టు చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.