Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 1, 2023: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, రైతాంగానికి అన్ని విధాల తోడు ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు.

కొవ్వూరు నియోజకవర్గంలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సొసైటీలల్లో నూతన చైర్మన్లు, సభ్యులుగా ఎన్నికైన వారికి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియామక పత్రాలను అందజేశారు.

అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ.. రైతులకు, ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నూతనంగా ఎన్నికైన వారికి హోం మంత్రి సూచించారు.

నూతనంగా ఎన్నికైన వారి వివరాలు: కొవ్వూరు పట్టణంలోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ కోపరేటివ్ సొసైటీకి చైర్మన్ గా అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర ఎన్నికయ్యారు.

పశివేదల సొసైటీకి వేములపల్లి రామారావు, దొమ్మేరు సొసైటీకి ముదునూరి సూర్యనారాయణ రాజు, ఆరికరేవుల సొసైటీకి చావా పేర్రాజు, మానికొండ సొసైటీకి గంగిశెట్టి వీర వెంకట రమణమూర్తి (వాసు), కాపవరం సొసైటీకి సత్యనారాయణ నూతన చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

అలాగే మార్కొండపాడు సొసైటీ సభ్యులుగా తాడేపల్లి శ్రీనివాసరావు, అంబటి మురళీమోహన్.. కాపవరం సొసైటీ సభ్యులుగా కంచుమర్తి బాలశంకర్, వెంపాటి సత్యనారాయణ లు ఎన్నికయ్యారు.

error: Content is protected !!