365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 20,2025: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) తన అత్యంత పాపులర్ SUV హోండా ఎలివేట్‌కు సరికొత్త టాప్-ఎండ్ వేరియంట్ ‘ఎలివేట్ ఏడీవీ ఎడిషన్’ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ధైర్యంగా, సాహసోపేతంగా కనిపించే ఈ స్పెషల్ ఎడిషన్.. యువ కస్టమర్లను టార్గెట్ చేస్తూ రోడ్డుపై బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
బయటి నుంచి లోపలి వరకు పూర్తి బ్లాక్ థీమ్, ఆరెంజ్ హైలైట్స్, ఏడీవీ బ్యాడ్జింగ్, బ్యాక్‌లిట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆరెంజ్ స్టిచింగ్ సీట్లు, ఆరెంజ్ యాక్సెంట్ అల్లాయ్ వీల్స్, గ్లాసీ బ్లాక్ ఆల్ఫా-బోల్డ్ ప్లస్ ఫ్రంట్ గ్రిల్.. ఇలా ఒక్కో డీటెయిల్ చూస్తే ఈ కారు రోడ్డుపై ఎవరి చూపుల్ని ఆపగలదని స్పష్టమవుతోంది.
హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ & సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ మాట్లాడుతూ.. ‘‘ఎలివేట్ లాంచ్ అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏడీవీ ఎడిషన్ ద్వారా మరింత చురుకైన, డైనమిక్ జీవనశైలి గడిపే యువ కస్టమర్లకు సరైన ఎంపికను అందించాం.
తెలంగాణ మాకు కీలక మార్కెట్. ఇక్కడ హోండా సిటీ, ఎలివేట్, అమేజ్ మోడళ్లు ఎప్పటికప్పుడు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ సరికొత్త ఏడీవీ ఎడిషన్ కూడా ఇక్కడ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం’’ అని తెలిపారు.

పవర్‌ట్రెయిన్‌లో మార్పు లేదు. అదే 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ (121 PS), 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ CVT ఆటోమెటిక్ ఆప్షన్. హోండా సెన్సింగ్ ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, LaneWatch కెమెరా, 360° వ్యూ (ఆప్షనల్) వంటి అన్ని సేఫ్టీ ఫీచర్స్ అలాగే ఉన్నాయి.
ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ):
- సింగిల్ టోన్ MT : ₹15.29 లక్షలు
- డ్యూయల్ టోన్ MT : ₹15.49 లక్షలు
- సింగిల్ టోన్ CVT : ₹16.46 లక్షలు
- డ్యూయల్ టోన్ CVT : ₹16.66 లక్షలు
(ఈ ధరల్లో పూర్తి ఏడీవీ యాక్సెసరీ ప్యాక్ ధర కలిపి ఉంటుంది)

రంగులు: మీటియరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ – సింగిల్ & డ్యూయల్ టోన్ ఆప్షన్స్‌లో లభ్యం.
ఇప్పటి నుంచే హోండా డీలర్‌షిప్‌ల్లో బుకింగ్స్ ప్రారంభం.. త్వరలోనే డెలివరీలు కూడా షురూ కానున్నాయి. రోడ్డుపై ఒక బోల్డ్ మూవ్ చేయాలనుకునే వాళ్లకు.. హోండా ఎలివేట్ ఏడీవీ ఎడిషన్ సరైన ఛాయిస్..
