365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, సెప్టెంబర్ 2,2025: భారత మార్కెట్లో మిడ్‌సైజ్ SUV విభాగంలో పోటీగా ఉన్న హోండా ఎలివేట్‌కి తాజా అప్‌డేట్‌లు వచ్చేశాయి. హోండా కార్స్ ఇండియా ఈ SUVకి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి కొత్త లుక్‌లో విడుదల చేసింది.
ఎలాంటి మార్పులు జరిగాయి?
తయారీదారు తెలిపిన వివరాల ప్రకారం ఎలివేట్ SUVలోని V, VX, ZX వేరియంట్లు అప్‌డేట్ అయ్యాయి. ప్రత్యేకంగా ZX వేరియంట్లో ఐవరీ థీమ్‌ను ప్రవేశపెట్టారు. ఐవరీ లెదర్ సీట్లు, తలుపులపై లైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో ఈ కొత్త టచ్ కనిపిస్తుంది. అలాగే, 360 డిగ్రీల కెమెరా, యాంబియంట్ లైట్ ఆప్షన్‌గా లభించనున్నాయి.

V, VX వేరియంట్లలో బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు ఆల్ఫా బోల్డ్ ప్లస్ గ్రిల్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. అదనంగా క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ అనే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సేఫ్టీ ఫీచర్లు..
హోండా ఎలివేట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్‌వాచ్ కెమెరా, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, మల్టీ యాంగిల్ రియర్‌వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ యాంకరేజ్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్‌లో మార్పుల్లేవు
ఈసారి కేవలం కాస్మెటిక్ అప్‌డేట్‌లు మాత్రమే వచ్చాయి. ఇంజిన్ మాత్రం యథాతథంగా 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్‌గానే ఉంది. దీని తోడు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి.

ధర ఎంత?
ఎలివేట్ V వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 12.39 లక్షలు
VX వేరియంట్ ధర రూ. 14.13 లక్షలు
ZX వేరియంట్ ధర రూ. 15.51 లక్షలు
ఇది కూడా చదవండి…పోకో నుంచి కొత్త ఫోన్ లాంచ్: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రూ. 10 వేల లోపు ధరలో!
ఎవరితో పోటీ.. ?
హోండా ఎలివేట్‌కి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, MG హెక్టర్, మహీంద్రా స్కార్పియో, టాటా హారియర్ వంటి మిడ్‌సైజ్ SUVలు ప్రధాన పోటీదారులు.