365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21,2025: ఆ మధ్య సాప్పని బ్రదర్స్ ‘శాసనసభ’ పేరుతో భారీ స్థాయిలో ఓ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ‘షణ్ముఖ’ చిత్రాన్ని నిర్మించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాకు ఆ అన్నదమ్ముల్లో ఒకరైన షణ్ముగం సాప్పని డైరెక్టర్! అంతేకాదు… ఇందులో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ అందించాడు. అవికా గోర్ హీరోయిన్ గా నటించింది.
ఇంతకూ ఈ సినిమా కథేంటంటే… ఓ గ్రామంలో ఉండే విగాండ (చిరాగ్ జానీ)కి కొడుకు పుడతాడు. అతనికి ఆరు ముఖాలు ఉంటాయి. వికృతంగా ఉన్న ఆ కొడుకు మామూలుగా మారాలంటే వివిధ రాశులకు చెందిన యువతులను బలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు చెబుతాడు.
దాంతో బావమరిది సాయంతో అమ్మాయిలను కిడ్నాప్ చేయించి, హత్య చేస్తుంటాడు విగాండ. రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) దృష్టిలోకి ఈ అమ్మాయిల మిస్సింగ్ అంశం వస్తుంది. దీనిపై పరిశోధన చేయాలని ఆమె భావిస్తుంది.
అందుకోసం గతంలో తాను బ్రేకప్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ కార్తీ (ఆది సాయికుమార్) సాయం కోరుతుంది. మొదట ఆమె వాదనలో పసలేదని భావించిన ఆది… ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుంటాడు. కిడ్నాప్ కు గురి అయిన అమ్మాయిలు, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి బోయ్ ఫ్రెండ్స్ గురించి ఆచూకీ తీయడం మొదలెడతాడు.
ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన విగాండ ను కార్తీ, సారా పట్టుకోగలిగారా? అతనికి చట్టప్రకారం శిక్ష వేయించగలిగారా? కురూపిగా పుట్టిన కొడుకును మామూలు వాడిని చేయాలనుకున్న విగాండ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే ఈ చిత్ర కథ.
కథ కు తగ్గట్టే సినిమా స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ప్లే తో సాగుతుంది.. ‘షణ్ముఖ’ అనే పవర్ ఫుల్ టైటిల్ కి కథ కరెక్ట్ గా కుదిరింది..
దర్శకుడు షణ్ముగం కథ నీ చెప్పడం లో స్క్రీన్ ప్లే లో పట్టు బాగుంది, ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్ లు మర్డర్ లు ఇన్వెస్టిగేషన్ సెకండ్ లో కేసు నీ కనిపెట్టడం , ప్రి క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు , కిడ్నాప్ ఎపిసోడ్ లు బాగున్నాయి.. హీరో సాయి కుమార్ క్యారెక్టర్, హీరోయిన్ రోల్ , విలన్ పాత్ర, దర్శకుడు షణ్ముగం పకడ్బందీ గా బాగా రాసుకున్నాడు .. మంచి మాస్ డైరెక్టర్ లక్షణాలు కనిపిస్తున్నాయి
రవి బస్సుర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్, పాటలు కూడా బాగున్నాయి.
విడుదల తేదీ: మార్చి 21, 2025
నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని , మనోజ్ ఆది , వీర శంకర్ , కృష్ణుడు, అరియనా, తదితరులు
బ్యానర్: సాప్‌బ్రో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్: తులసి రామ్ సప్పని షణ్ముగం సప్పని
సినిమాటోగ్రఫీ : ఆర్.ఆర్. విష్ణు ఎడిటర్ : ఎంఏ మాలిక్
సంగీతం : రవి బస్రూర్
దర్శకుడు : షణ్ముగం సప్పని..
ఇది కూడా చదవండి…ఆండ్రాయిడ్ 16 బీటా 3 అప్‌డేట్‌ను విడుదల చేసిన గూగుల్..
ఇది కూడా చదవండి…వాట్సాప్ హ్యాక్ అయిందా..? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..!
మాలిక్ ఎడిటింగ్, రవి బస్సుర్ సంగీతం , R.R. విష్ణు కెమెరా పనితనం బాగుంది.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి , సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.. స్క్రీన్ మీద కూడా కనపడింది
సినిమాకి మెయిన్ హైలైట్ కథ..షణ్ముగం సప్పని దర్శకత్వాన్నికి రవి బస్సుర్ మ్యూజిక్ కి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది
నటీనటుల విషయానికి వస్తే… ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పెర్ఫెక్ట్ సెట్ అయ్యాడు.. అవికా గోర్ అందం, అభినయం తో పోషించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి , మెయిన్ విలన్ విగాండ గా చిరాగ్ అలీ నటించాడు. ఇప్పటి వరకూ పలు చిత్రాలలో హీరోగానూ, కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించి బిగ్ బాస్ తర్వాత ఆదిత్య ఓం విలన్ పాత్ర పోషించాడు మంచి నటన కనబరిచాడు..
దర్శకుడు షణ్ముగం ‘బుల్లెట్’ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. ఇతర పాత్రలను కృష్ణుడు, మధుమణి, మనోజ్ నందం, చిత్రం శ్రీను, అరియానా, వీరశంకర్, సీవీఎల్ నరసింహారావు తదితరులు పోషించారు. సాంకేతికంగానూ ఈ సినిమా క్వాలిటీ గా ఉంది.. విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది..
365తెలుగుడాట్ కామ్ రేటింగ్ : 3.5..