365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి19, 2025: సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. ఆమె ఇప్పుడు తిరిగి రాబోతోంది. అయితే ఆమె అందుకోబోయే వేతనం చర్చనీయాంశంగా మారింది. వ్యోమగాములకు ప్రత్యేక ఓవర్ టైం చెల్లింపు వంటిది ఏమీలేదని నాసా రిటైర్డ్ వ్యోమగామి కేడీ కోల్‌మాన్ వెల్లడించారు.

వారు నాసా ఉద్యోగులు కాబట్టి, వారి అంతరిక్ష సమయాన్ని భూమిపై ఏదైనా సాధారణ పని యాత్ర లాగానే పరిగణిస్తారు. ISS లో వారి ఆహారం , జీవన ఖర్చులను NASA భరిస్తుంది. కోల్‌మన్ తనకు లభించే ఏకైక అదనపు పరిహారంగా రోజువారీ భత్యం ఇస్తారు. ఇది రోజుకు కేవలం నాలుగు డాలర్లు అంటే రూ. 347 అని అన్నారు.
Read this also…Choosing the Best Cookware: A Guide to Material, Benefits, and Top Brands..
Read this also…Sunita Williams: A Trailblazing Astronaut and Inspiration to All
2010-11లో తన 159 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటే కోల్‌మన్ అదనపు జీతం కింద మొత్తం 636 డాలర్లు అంటే రూ. 55,000 అందుకున్నాడు. దీని ఆధారంగా, సునీతా విలియమ్స్ ,బుచ్ విల్మోర్ 287 రోజులు అంతరిక్షంలో గడిపినందుకు అదనపు పరిహారంగా 1,148 డాలర్లు అంటే సుమారు రూ. లక్ష మాత్రమే పొందగలుగుతారు.