365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20 ,హైదరాబాద్ : మధుమేహం (డయాబెటిస్) అనేది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి) కేసులలో 44% వాటికి కారణంగా , జవాబుదారీగా ఉంటోంది. మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని లేదా సమర్ధవంతం గా ఉపయోగించలేకపోయే పరిస్థితి-తద్వారా ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ (గ్లూకోజ్) స్థాయిల నిర్వ హణను కష్టతరం చేస్తుంది.
ఇది నియంత్రించబడకపోతే, ఇది కంటి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పాద ఆరోగ్య సమస్యలతో సహా సికెడికి మించిన ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మీరు డయాబెటిక్ కిడ్నీ వ్యాధితో జీవిస్తుంటే, నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. మీ డయాబెటిస్, మూత్రపిండాలు.. రెండింటిపై శ్రద్ధ వహించండి. దాంతో మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
డయాబెటిస్ మూత్రపిండాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
మూత్రపిండాలలో రక్త నాళాలు దెబ్బతినడం బలహీనపడటం లాంటివి డయాబెటిస్ దుష్ప్రభావాలలో ఉంటాయి. మీ రక్తం నుండి వ్యర్ధాలు ,టాక్సిన్స్ (విషపదార్థాలు) మూత్రపిండా లు ఫిల్టర్ చేయాలి. దెబ్బతిన్న రక్త నాళాలు మూత్రపిండాలను పని చేయకుండా నిరోధిస్తాయి.
మూత్రపిండాల పనితీరు సరిగా లేకుంటే అది మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. చివరికి మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు అధిక రక్తపోటు కు కూడా గురి కావచ్చు, ఇది సికెడికి మరో ప్రధాన కారణం.
మధుమేహం కారణంగా శరీరంలోని నరాలు కూడా దెబ్బతినవచ్చు, ఇది మూత్రాశయం డ్రైనేజీలో ఇబ్బందికి దారితీస్తుంది. మూత్రాశయం, సంబంధిత ఒత్తిడి మూత్రపిండం దెబ్బతినేందుకు దారితీయవచ్చు.
మూత్రాశయంలో సుదీర్ఘకాలం మూత్రం ఉంటే, అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉన్న మూత్రంలో బ్యాక్టీరియా పెరుగుదల ప్రారంభమై దాని నుంచి ఇన్ ఫెక్షన్ ఏర్పడుతుంది.
డయాబెటిస్ రోగులలో మూత్రపిండ వ్యాధి సంకేతాలు
తరచుగా దాహం
పదేపదే మూత్రవిసర్జన
అధిక రక్త పోటు
ఆకస్మిక బరువు తగ్గడం
మీ మూత్రంలో కీటోన్స్ / ప్రోటీన్ ఉనికి
అలసట
వాంతితో పాటు మార్నింగ్ సిక్ నెస్
రక్తహీనత, పేల్ నెస్ (చర్మం రంగులో అసాధారణ లేతరంగు)
డయాలసిస్ ,డయాబెటిస్ అర్థం చేసుకోవడం:
డయాబెటిక్ కిడ్నీ వ్యాధికి మీరు తీసుకునే డయాలసిస్ రకాన్ని బట్టి, మీ చికిత్స మీ డయాబెటిస్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది లేదా ప్రభావితం చేయకపోవచ్చు.
హిమోడయాలసిస్ ,డయాబెటిస్ – మీ డయాలసిస్ చికిత్స మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. హిమోడయాలసిస్ చికిత్స సమయంలో మీరు రక్తంలో చక్కెరలో వ్యత్యాసాలను చూసినట్లయితే, బహుశా అది మీరు మీ దినచర్యను మార్చుకుంటున్నందున అయిఉండవచ్చు. మీరు తీసుకునే ఆహారం లేదా మీ డయాబెటిస్ నియంత్రణ నిర్వహణపై మీకు సందేహాలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి
పెరిటోనియల్ డయాలసిస్ , డయాబెటిస్ – మీ రక్తంలో చక్కెరను నేరుగా మీ చికిత్స ద్వారా విడదీయవచ్చు ఎందుకంటే మీ పెరిటోనియల్ డయాలసిస్ (పిడి) డయాలైసేట్ డెక్స్ట్రోస్ అనే చక్కెరను కలిగి ఉంటుంది. మీ పీడీ ద్రావణంలోని డెక్స్ట్రోస్ మీ రక్తం నుండి అదనపు ద్రవాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుంది కాని ఇది మీ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.
అదనంగా, డయాలిసేట్ వివిధ పరిమాణాల్లో డెక్స్ట్రోస్ కలిగి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ప్రభావాలను భర్తీ చేయడానికి, మీరు మీ ఇన్సులిన్ మోతాదును పెంచుకోవాల్సి వస్తుంది. మీ వైద్యుడిని సంప్రదించండి. అవసరమైన విధంగా మార్పులు ఎలా చేయాలో వారు మీకు నేర్పుతారు.✍️-మారిశెట్టి మురళి కుమార్